iQOO 13 Vs iQOO 12: iQOO 13 స్మార్ట్ ఫోన్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే, ఇది గతంలో లాంచ్ అయిన iQOO 12 స్మార్ట్ ఫోన్‌కి అప్డేటెడ్ వేరియంట్‌గా విడుదలైంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏది బెస్టో అనే వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
iQOO 13 Vs iQOO 12 Telugu: ప్రముఖ మొబైల్ కంపెనీ iQOO ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌తో ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వినియోదారులను కంపెనీ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు గత మోడల్స్‌కి అప్డేటెడ్‌గా కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది గతంలో iQOO 12 స్మార్ట్ ఫోన్ ఎంత ప్రజాదరణ పొందిందో మనందరికీ తెలుసు. అయితే, దీనికి అప్డేటెడ్‌గా..iQOO 13ను తీసుకువచ్చింది.
1/7ఈ iQOO 13 స్మార్ట్ ఫోన్ అనేక రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం చాలామంది ఈ రెండు మొబైల్స్‌లో ఏది కొనుగోలు చేయాలో తెలీక తికమక పడుతున్నారు. మార్కెట్లోకి iQOO 13 స్మార్ట్ ఫోన్ విడుదలైనప్పటికీ పాత మోడల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్‌లో ఏది బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
2/7
3/7ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే వివరాల్లోకి వెళితే... గతంలో మార్కెట్లోకి విడుదలైన iQOO 12 స్మార్ట్ ఫోన్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక iQOO 13 మొబైల్ కూడా దాదాపు ఇదే డిస్ప్లేను కలిగి ఉంది.
4/7ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కు సంబంధించిన ప్రాసెసర్ వివరాల్లోకి వెళ్తే.. పాత మోడల్ మొబైల్ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అందుబాటులోకి వచ్చింది. ఇక iQOO 13 మొబైల్లో సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. గేమింగ్ చేసే వారికి వీలుగా ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
5/7ఇక ఈ రెండు మొబైల్స్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. పాత మోడల్ iQOO 12 మొబైల్లో ఎంతో శక్తివంతమైన 5000 mAh బ్యాటరీ ని అందిస్తోంది. అలాగే ఇది 120 వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఇక కొత్త మోడల్ కూడా దాదాపు గత మోడల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా iQOO 13 లో కంపెనీ ప్రత్యేకమైన ఛార్జింగ్ టెక్నాలజీని అందించినట్లు సమాచారం.
6/7ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌కు సంబంధించిన కెమెరాల డీటెయిల్స్ చూస్తే.. గత మోడల్ లో రెండు 50MP కెమెరాలు ఉండగా.. ఒకటి అదనంగా 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక కొత్త మోడల్‌లో కూడా ఇదే కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన ఇమేజింగ్ ప్రాసెసింగ్ టీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
7/7సాధారణంగా మొబైల్ వినియోగించాలనుకునేవారు iQOO 12 మొబైల్ కొనుగోలు చేయొచ్చు.. అదే పెద్ద పెద్ద గేమ్స్, మల్టీ టాస్కింగ్, కెమెరాని ఎక్కువగా వినియోగించాలనుకునేవారు తప్పకుండా iQOO 13 మొబైల్ ను ఎంపిక చేసుకోవచ్చు.