Director Sanoj Mishra: కుంభమేళ వైరల్ యువతి మోనాలీసా ఘటనలో ప్రస్తుతం దిమ్మతిరిగే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు మోనాలీసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా ను అదుపులోకి తీసుకున్నారు.
కుంభమేళలో పూసలమ్మడానికి వచ్చిన మోనాలీసా అనూహ్యంగా ఫెమస్ అయిన విషయం తెలిసిందే. ఆమెను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేసి ఏకంగా హీరోయిన్ ను చేశారు. డైరెక్టర్ సనోజ్ మిశ్రా కుంభమేళ బ్యూటీకీ తన సినిమాలో చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఇండోర్ కు వెళ్లి మరీ ఆమెతో తన సినిమా గురించి వివరించి మరీ చెప్పారు.
అయితే.. తాజాగా.. కుంభమేళ బ్యూటీ మోనాలీసా డైరెక్టర్ గురించి షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒక యువతిని కూడా హీరోయిన్ చేస్తానని చెప్పి.. ఆమెను తరచుగా యూపీలోని జాన్సీ రైల్వేస్టేషన్ కు వెళ్లి కలిసేవాడు.ఈ క్రమంలో పరిచయం పెంచుకుని తనతో ఏకాంతంగా గడపాలని ఆమెను ఫోర్స్ చేసేవాడు. ఆ తర్వాత తనతో సెక్స్ చేయకుంటే.. చచ్చిపోతానని చెప్పి ఆమెను లొంగ తీసుకున్నాడు.
సదరు యువతికి సినిమాల్లో చాన్స్ ఇస్తానని చెప్పి పలు మార్లు అత్యాచారం చేశాడు. తాజాగా.. యువతి ఢిల్లీ పోలీసులకు తాజాగా.. వెళ్లి ఫిర్యాదు చేయడంతో సనోజ్ మిశ్రా బండారం బైటపడింది. యువతికి మత్తు మందు ఇచ్చిన కూడా అత్యాచారంకు పాల్పడినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు సనోజ్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సనోజ్ మిశ్రా హైకోర్టులో ముందస్తు బెయిల్ ను దాఖలు చేసుకున్నారు. కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ క్రమంలో సనోజ్ మిశ్రాను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
మరోవైపు డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ కావడంతో కుంభమేళ బ్యూటీ మోనాలీసా లైఫ్ ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను ది డైయిలీ ఆఫ్ మణిపూరీలో హీరోయిన్ చేస్తానని ఇప్పటికే సనోజ్ మిశ్రా చెప్పాడు. కానీ ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆమె ఫ్యూచర్ డెంజర్ లో పడినట్లు తెలుస్తొంది.
ఈ విషయం ప్రస్తుతం వైరల్గా మారింది. అనవసరంగా కామాంధుడి చేతిలో చిక్కిందని.. ఆమెకు లేని పోనీ ఆశలు కల్పించి.. కన్నవాళ్ల నుంచి దూరం చేశారని కూడా నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను తన స్వగ్రామంకు వెళ్లిపోవాలని కూడా ముందు జాగ్రత్తలు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఘటనతో మోనాలీసా ఆశలు అడియాశలు అయినట్లు చెప్పుకొవచ్చు.