Srikanth Addala Controversy : కొత్త బంగారులోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల పైన ప్రస్తుతం వస్తున్న వార్తలు అందరిని కలవరపరుస్తున్నాయి. అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తీసిన దర్శకుడిపై ఇలాంటి రూమర్స్ ఏమిటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చలనచిత్ర రంగంలో ప్రేమాయణాలు, వివాహాలు, బ్రేకప్‌లు కొత్తేమీ కాదు. కానీ వివాహితులుగా ఉన్న వారిపై అఫైర్ ఆరోపణలు.. రావడం కలకలం రేపుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలు త్వరగా వైరల్ అవుతూ ఉంటాయి స తాజాగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, తమిళ స్టార్ హీరోయిన్ బృగిదా సాగాతో అఫైర్ నడుపుతున్నట్లు పుకార్లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సీనియర్ నటుడు పార్ధిబన్ దీనిపై స్పందించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీకాంత్ అడ్డాల పేరు ప్రత్యేకమైనది. క్లాస్ సినిమాలతో ఆకట్టుకున్న ఆయనపై ప్రస్తుతం నెగటివ్ ప్రచారం జరుగుతోంది. ‘పెడకాపు’ సినిమాకు దర్శకత్వం వహించిన సమయంలో బృగిదాతో ఆయన సన్నిహితంగా మారారని, వారి మధ్య రిలేషన్ ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన భార్య రాగసుధ తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి.
సీనియర్ నటుడు పార్ధిబన్ ఈ వార్తలను ఖండించారు. "రాగసుధ చాలా ధైర్యవంతురాలు. ఆమె గాసిప్స్‌ను పట్టించుకునే వ్యక్తి కాదు. శ్రీకాంత్, బృగిదా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు" అని ఆయన స్పష్టం చేశారు. రాగసుధ తన సినీ కెరీర్‌తో బిజీగా ఉన్నారని, ఆప్యాయమైన వ్యక్తిగా ఆమెను అభివర్ణించారు.
శ్రీకాంత్ అడ్డాల ఈ విషయంలో ఇప్పటివరకు స్పందించలేదు. అయితే పార్ధిబన్ చేసిన క్లారిటీతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా "అన్నీ గాసిప్సులే" అంటూ కామెంట్లు వస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీలో గాసిప్స్ సాధారణమే అయినా అవి వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. పార్ధిబన్ చేసిన క్లారిటీతో శ్రీకాంత్ అడ్డాలపై జరుగుతున్న విమర్శలు కొంతవరకు తగ్గినట్టే.