Add Zee Business As A Preferred Source
App

National Award: గుండు కొట్టించుకొని మరి నేషనల్ అవార్డ్ కొట్టిన స్టార్ డైరెక్టర్ గారాలపట్టి.. ఇంతకీ ఆ తండ్రికి తగ్గ కూతురెవరంటే..?

Written ByAruna Maharaju
Published: Aug 02, 2025, 10:09 AM IST|Updated: Aug 02, 2025, 10:15 AM IST

Sukriti Veni: గాంధీ తాత చెట్టు సినిమాకు గాను నేషనల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణికి వచ్చింది. ఫస్ట్ మూవీకే నేషనల్ అవార్డ్ అందుకోవడంతో అంతా సుకృతిని అభినందిస్తున్నారు. మొదటి సినిమాకే బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా అవార్డు అందుకోవడంతో అంతా సుకృతిని..  తండ్రికి తగ్గ కూతురని పొగుడుతున్నారు.

Sukriti Veni In Gandhi Tatha Chettu Movie1/5

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి

2023 సంవత్సరంలో రిలీజైనా సినిమాలకు గాను 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను(National Awards) కేంద్రం ప్రకటించింది. ఈసారి మన తెలుగు మూవీస్ కి కూడా అవార్డులు బాగానే వచ్చాయి. అయితే జాతీయ ఉత్తమ బాలనటిగా డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఎంపికైంది. గాంధీ తాత చెట్టు(Gandhi Tatha Chettu) సినిమాకు గాను ఈ అవార్డు లభించింది. 

Sukriti Veni In Gandhi Tatha Chettu Movie2/5

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి

సుకృతి వేణి ముఖ్య పాత్ర‌లో న‌టించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్, రవిశంకర్ నిర్మించారు. మల్లాది పద్మావతి దర్శకత్వం వహించారు. అయితే విడుదలకి ముందే దేశ విదేశాల్లో ఈ మూవీ పలు అవార్డులను సొంతం చేసుకుంది. 

Sukriti Veni In Gandhi Tatha Chettu Movie3/5

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి

అయితే ఈ మూవీ కోసం గుండు కూడా చేయించుకున్నఈ స్టార్ కిడ్.. ఏ అమ్మాయి చేయని సాహసమే చేసిందని చెప్పుకోవచ్చు.  నార్మల్ గా అమ్మాయిలకి హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ సినిమాలో తన పాత్రం కోసం సుకృతి.. నిజంగానే గుండు చేయించుకుంది.   

Sukriti Veni In Gandhi Tatha Chettu Movie4/5

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి

ప్రజెంట్ ఈ మూవీ ఈటీవీ విన్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి చిత్రంతోనే జాతీయ అవార్డు గెలిచిన సుకృతిని చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రశంసించారు.

Sukriti Veni In Gandhi Tatha Chettu Movie5/5

డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి

2023లోనే ఈ సినిమా సెన్సార్ అయిపోయినప్పటికీ.. 2025 జనవరి 24న థియేటర్స్ లో రిలీజైంది. అందుకే 2023 సినిమాల లిస్ట్ లో ఈ అవార్డును గెలుచుకుంది. అందరి హృదయాల్ని తాకేలా, మనసుల్ని హత్తుకునేలా గాంధీ తాత చెట్టు కథ ఉంటుంది.