Add Zee Business As A Preferred Source
App

Safety Tips: దీపావళి టపాసులు కాల్చేటప్పుడు తస్మాత్ జాగ్రత్త.. ఈ 7 సేఫ్టీ టిప్స్ తప్పక పాటించండి..!

Written ByAruna Maharaju
Published: Oct 20, 2025, 03:28 PM IST|Updated: Oct 20, 2025, 03:32 PM IST

Happy Diwali 2025: దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ ఈ దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి అనగానే అందరికి గుర్తొచ్చేది టపాసులు.. ఇవి లేకుండా అసలు పండగే ఉండదు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తమ ఫ్యామిలీతో కలిసి టపాసులను కాలుస్తూ పండగ చేసుకుంటారు. టపాసులు కాల్చడం ఆనందమే అయినా కొన్నిసార్లు అజాగ్రత్త, నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తుంది.  దీపావళి రోజున పటాకులు కాల్చే ముందు మీరు పాటించాల్సిన 7 సేఫ్టీ టిప్స్ మీకోసం అందిస్తున్నాం.
 

Diwali 7 Fire cracker Safety Tips1/6

దీపావళి సెలబ్రేషన్స్

టపాసులు కాల్చే ముందు కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ముందుగా ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీగా ఉంచుకోండి. చిన్న చిన్న గాయాలైనప్పుడు యాంటీసెప్టిక్ క్రీమ్, నొప్పి తగ్గించే మందులు, క్లీనింగ్ లోషన్, బ్యాండేజీలు, కాటన్, హ్యాండ్ గ్లోవ్స్ వంటివి తప్పకుండా ఉండాలి. ఇవి అత్యవసర సమయంలో జీవితాన్ని కాపాడతాయి. 

Diwali 7 Fire cracker Safety Tips2/6

దీపావళి సెలబ్రేషన్స్

మీ దుస్తుల ఎంపికలో జాగ్రత్త వహించండి. సింథటిక్ లేదా నైలాన్ బట్టలు వేసుకోకండి, ఎందుకంటే అవి త్వరగా మంటలు అంటుకుని చర్మానికి తీవ్ర గాయాలు కలిగిస్తాయి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. దుపట్టాలు లేదా స్కార్ఫ్‌లు వేసుకోకూడదని గుర్తుంచుకోండి.  

Diwali 7 Fire cracker Safety Tips3/6

దీపావళి సెలబ్రేషన్స్

పటాకులు కాల్చేటప్పుడు చెవులు మరియు కళ్లను రక్షించుకోవడం మరో ముఖ్యమైన విషయం. చాలా టపాసులు ఎక్కువ శబ్దం చేస్తాయి, అది చెవులకు హాని చేస్తుంది. కాబట్టి ఇయర్‌బడ్స్ వాడండి. కళ్లకు జీరో పవర్ గాగుల్స్ పెట్టుకోవడం వల్ల కూడా రక్షణ లభిస్తుంది. 

Diwali 7 Fire cracker Safety Tips4/6

దీపావళి పండుగ

అలాగే ఎప్పుడూ బహిరంగ స్థలాల్లో మాత్రమే టపాసులు కాల్చండి. ఇంటి లోపల లేదా బాల్కనీల్లో చేయకండి.. ఎందుకంటే పరిమిత ప్రదేశాల్లో మంటలు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది.

Diwali 7 Fire cracker Safety Tips5/6

దీపావళి

చేతిలో పట్టుకుని టపాసులు కాల్చడం అత్యంత ప్రమాదకరం. ఇలా చేస్తే ఊహించని సమయంలో చేతికి లేదా ముఖానికి గాయాలయ్యే అవకాశం ఉంది. ఎల్లప్పుడూ నేల మీద పెట్టిన తర్వాత మాత్రమే కాల్చండి. పాత లేదా పాడైన టపాసులను ఉపయోగించకూడదు. అవి చేతిలోనే పేలి ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి. మంచి నాణ్యత గల కొత్త టపాసులు మాత్రమే కొనుగోలు చేయండి.   

Diwali 7 Fire cracker Safety Tips6/6

దీపావళి పండుగ

చివరగా, టపాసులు కాల్చే స్థలం దగ్గర ఒక బకెట్ నీరు మరియు మందపాటి దుప్పటి ఉంచుకోండి. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఇవి తక్షణ చికిత్సకు సహాయపడతాయి. ఈ చిన్న జాగ్రత్తలతో దీపావళి ఆనందంగా మరియు సురక్షితంగా గడుపుకోవచ్చు. హ్యాపీ దీపావళి 2025!