Add Zee Business As A Preferred Source
App

School Holidays: విద్యార్థులకు మరో బంపర్‌ గుడ్‌న్యూస్‌.. దీపావళి స్కూళ్లకు సెలవుల ప్రకటన..!

Written ByRenuka Godugu
Published: Sep 26, 2025, 08:36 AM IST|Updated: Sep 26, 2025, 08:36 AM IST

Diwali School Holidays 2025: విద్యార్థులకు ప్రస్తుతం దసరా సెలవులు ఎంజాయ్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 22వ తేదీ సోమవారం నుంచే అన్నీ ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే దీపావళి కూడా వచ్చే నెలలోనే రానుంది. ఈ నేపథ్యంలో దీపావళికి ఈ పండుగకు స్కూళ్లకు సెలవులు వివిధ రాష్ట్రాల్లో ప్రకటించారు. దసరా సెలవులు పూర్తయిన కొద్ది రోజుల్లోనే దీపావళి సెలవులు కూడా రానున్నాయి. అవి ఎప్పుడు ఏ ప్రాంతాల్లో తెలుసుకుందాం..
 

Mahatma Gandhi Jayanthi1/5

మహాత్మా గాంధీ జయంతి

 అక్టోబర్ 2వ తేదీ విజయదశమి. ఆ రోజు మహాత్మా గాంధీ జయంతి కూడా రానుంది. అయితే ఈ ఏడాది 2025 అక్టోబర్ 21వ తేదీ దీపావళి అమావాస్య, లక్ష్మి పూజ కూడా నిర్వహించనున్నారు. అక్టోబర్ 22 దీపావళి మహారాష్ట్ర క్యాలెండర్ ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇక స్కూళ్లకు ఆ రెండు రోజులు సెలవులు ప్రకటించవచ్చు.  

Dussehra Holidays2/5

 దసరా సెలవులు

 దసరా సెలవులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3వ తేదీ ఆంధ్ర ప్రదేశ్ లో స్కూళ్లు పునః ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మొత్తంగా 13 రోజులపాటు దసరా సెలవులు వచ్చాయి. దీంతోపాటు రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌, కర్ణాటక, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా భారీగానే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించారు.  

Anganwadi Holidays3/5

అంగన్వాడి సెలవులు

 ఇది ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిస్తుంది. ఇక తాజాగా అంగన్వాడీల కూడా సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. గర్భవతులకు పౌష్టికాహారాన్ని వారి ఇంటికే పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. తాజాగా అంగన్వాడి వర్కర్‌లకు కూడా సెలవులు వచ్చాయి  

Festive Holidays4/5

పండగ సెలవులు

 పండగ సెలవులు అతి తక్కువ సమయంలోనే వచ్చాయి. దసరా సెలవులు పూర్తయిన 15 రోజుల్లో దీపావళి సెలవులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులకు ఇది భారీ శుభవార్త. దీపావళి రోజు లక్ష్మి పూజ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ఇది ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రతి ఏడాది దసరా, దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతాయి  

vacation5/5

లాంగ్ వెకేషన్‌

అయితే, విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతోపాటు లాంగ్ ట్రిప్‌ వెళ్లడానికి ఇది మంచి అవకాశం. ఎక్కువ రోజులపాటు బ్రేక్ వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లాంగ్ వెకేషన్‌ వెళ్లవచ్చు. ఇది అద్భుతమైన అవకాశం. దేశంలో దసరా, దీపావళి సెలవులు ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత క్రిస్మస్ కి మిషనరీ స్కూల్స్ కి ఎక్కువగా సెలవులు లభిస్తాయి.