Add Zee Business As A Preferred Source
App

Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు భారీ గుడ్‌ న్యూస్‌.. 78 రోజుల దీపావళి బోనస్‌ ప్రకటన, ఎప్పుడు జమా? ఎవరు అర్హులు..?

Written ByRenuka Godugu
Published: Sep 25, 2025, 08:33 AM IST|Updated: Sep 25, 2025, 08:33 AM IST

Railway Diwali Bonus Eligibilty: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 74 రోజుల ప్రోడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) ప్రకటిస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రూ.1866 కోట్లు రైల్వే ఉద్యోగులకు బోనస్‌గా కేటాయించనున్నారు. దీంతో 10.90 లక్షల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. అయితే ఈ బోనస్‌కు ఎవరు అర్హులు? ఎప్పుడు వారి ఖాతాలో జమ కానున్నాయి తెలుసుకుందాం.
 

Narendra Modi1/5

నరేంద్ర మోదీ

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 78 రోజుల బోనస్‌ రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. దీనికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో కొన్ని కోట్లు రైల్వే ఉద్యోగులకు లబ్ధి పొందనున్నారు. దీపావళికి ముందే వారికి ఈ బోనస్‌ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.   

Railway Employees2/5

రైల్వే ఉద్యోగులు

 ప్రధానంగా రైల్వే ఉద్యోగులైన ట్రాక్ మెయిన్‌టైనెర్స్, లోకో పైలట్, ట్రాక్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టెక్నీషియన్స్, హెల్పర్స్, పాయింట్స్ మాన్, రైల్వే మినిస్ట్రీ ఎంప్లాయిస్‌తోపాటు ఇతర గ్రూపులకు చెందిన ఉద్యోగులు కూడా ఈ బోనస్ లబ్ధి పొందనున్నారు.   

Central GOVT3/5

కేంద్ర ప్రభుత్వం

 అయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగులు మాత్రం ఈ బోనస్ పరిధిలోకి రారు. ప్రతి ఏడాది దీపావళికి ముందు రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ఇది. గత ఎడాది మోదీ ప్రభుత్వం రూ.2,029 కోట్లు బోనస్ కోసం విడుదల చేశారు.  

Diwali Bonus4/5

దీపావళి బోనస్

అయితే అధికారిక సమాచారం మేరకు బెంగాల్, బీహార్ కి చెందిన రైల్వే ఉద్యోగులు దసరాకి ముందుగానే ఈ బోనస్ పొందనున్నారు. ఉత్తర భారత ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు దీపావళి ముందుగా ఈ బోనస్ అందుకోనున్నారు. అయితే, రైల్వే ఉద్యుగులు గరిష్టంగా రూ.17951 బోనస్ పొందనున్నారు.  

Deepavali5/5

దీపావళి

దసరా, దీపావళి, ఛత్‌పూజ్‌ సందర్భంగా అందరూ పూజలు, షాపింగ్లు చేసుకునే సమయం. బోనస్ విడుదల అవ్వడంతో వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలు తగ్గించడంతో నిత్యవసర వస్తువులు ఇతర కొన్ని లగ్జరీ వస్తువులు కూడా ధరలు తగ్గాయి.