Diwali Bumper Jackpot To AP Govt Employees DA Hike: దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా ప్రకటించారు. 3.64 శాతం డీఏ, డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా డీఏ, డీఆర్ పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1/6రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు దీపావళి కానుకగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ప్రకటించిన డీఆర్, డీఏ పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
2/6రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, రిటైర్డ్ ఉద్యోగులకు డీఆర్ మంజూరు చేస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
3/62024 జనవరి 1 నుంచి డీఏను 3.64 శాతం పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డీఎ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.
4/6పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) 3.64 శాతం ప్రభుత్వం పెంచగా.. డీఆర్ కూడా 2024 జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.
5/6డీఏ, డీఆర్ పెంపునకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎఫ్ ఎంఎస్ సీఈవోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
6/6నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండగా ఏపీ ప్రభుత్వం దీపావళి రోజు ఒక డీఏ ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు. రెండు డీఏల విడుదలపై ఆశలు పెట్టుకోగా ఒకటే రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతృప్తి చెందలేదు.