DMart Shopping: డీమార్ట్‌లో ఇలా షాపింగ్ చేస్తే మీ పర్స్‌ ఖాళీ కాదు.. రెట్టింపు బెనిఫిట్స్

DMart Shopping Tips In Telugu: రిటైల్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన డీమార్ట్‌లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారా? కొన్ని జాగ్రత్తలు.. సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి పొందవచ్చు. డీమార్ట్‌ చేసే ముందు ఈ టిప్స్‌ పాటిస్తే మీ పర్స్‌ ఖాళీ కాదు.

1 /6

భారతీయ రిటైల్ మార్కెట్‌లో డీమార్ట్ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తక్కువ ధరలు, నాణ్యమైన ఉత్పత్తులు, ప్రత్యేక పండుగ ఆఫర్ల కారణంగా ఇది వినియోగదారులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. సరైన సమయంలో షాపింగ్ చేయడం ద్వారా.. డిస్కౌంట్లను తెలివిగా ఉపయోగించడం, నాణ్యతను నిర్ధారించడం ద్వారా డీమార్ట్‌లో ఎక్కువగా ఆదా చేయవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే పర్స్‌కు ఖాళీ అయ్యింది.

2 /6

డీమార్ట్‌లో షాపింగ్ చేయడానికి ఉత్తమ సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంది. అప్పుడే మీ పర్స్‌లోని డబ్బు మిగులుతుంది. వారాంతాల్లో అంటే శని, ఆదివారాల్లో డీమార్ట్‌లు రద్దీగా ఉంటాయి. ఈ సమయాల్లో రద్దీ ఎక్కువ ఉంటుండడంతో డీమార్ట్‌ సంస్థ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించదు.

3 /6

నెల ప్రారంభంలో అంటే 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళ్తే దాదాపుగా ఆఫర్లు, డిస్కౌంట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. నెల తొలి వారం డీమార్ట్‌లు కిటకిటలాడుతాయి. ఈ సమయంలో షాపింగ్‌కు వెళ్లకపోవడం మంచిది.

4 /6

డీమార్ట్‌లలో పని రోజులు అంటే శని, ఆదివారంతోపాటు సెలవు రోజుల్లో వెళ్లరాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు డీమార్ట్‌కు వెళ్తే రద్దీ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజుల్లో డీమార్ట్‌ సంస్థ డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తుంటుంది.

5 /6

నెల మధ్యలో లేదా చివరిలో (అంటే నెల రెండు, మూడు వారాల్లో) షాపింగ్ చేయడం ఉత్తమం. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో ఆఫర్లు వేటిపై ఉన్నాయో నిశితంగా గమనించి కొనుగోలు చేయవచ్చు. వర్కింగ్‌ డేస్‌ (సోమ-శుక్ర)లో ఒకటి కొంటే ఒకటి ఉచితం.. లేదంటే పది శాతం తగ్గింపు వంటి ఆఫర్లు డీమార్ట్‌ ఇస్తుంటుంది.

6 /6

పైన పేర్కొన్న పద్ధతిలో సూచనలు పాటిస్తే డీమార్ట్‌లో చేసిన ఖర్చుకు అదనంగా లబ్ధి పొందవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక మొత్తంలో ప్రయోజనం పొందుతుంది. మీకు దగ్గరి వాళ్లు కూడా ఇలా ప్రయోజనం పొందాలనుకుంటే ఈ టిప్స్‌ ఉన్న వార్త లింక్‌ను వారికి షేర్‌ చేయండి.