Dmart Discount Offers: శనివారం, ఆదివారం వచ్చిందంటే చాలు..డీమార్ట్ తోపాటు మిగతా షాపింగ్ మాల్స్ లో జనం కిక్కిరిసిపోతారు. ఎందుకంటే వారాంతంలోనే ఖాళీ సమయం దొరికేది కాబట్టి. అందులోనూ మరో మూడు రోజుల్లో వినాయక చవితి పండగ రాబోతోంది. ఈ పండగ కోసం చాలా మంది ఇప్పటి నుంచే షాపింగ్ చేసేందుకు సిద్ధమవుతుంటారు. ఈ పండగను ద్రుష్టిలో పెట్టుకుని డీమార్ట్ కూడా ఎన్నో రకాల ఆఫర్లను మోసుకొచ్చింది. అవేంటో తెలుసుకుందాం.
1/7డీమార్ట్.. చాలా తెలివైన షాపింగ్ మాల్. కస్టమర్ల ఇష్టాయిష్టాలను ఇట్టే పట్టేయడంతో దిట్ట. అందుకే డీమార్ట్ ఓ వెలుగు వెలిగిపోతోంది. కస్టమర్లకు నచ్చే విధంగా ప్లాన్ చేస్తూ..పండగల సమయంలో ప్రత్యేక ఆఫర్లతో వారిని మరింత ఆకర్షిస్తోంది. దీంతో భారీగా సేల్స్ పెంచుకుంటూ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల మాదిరి నడిపిస్తోంది. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పండగ వస్తోంది. పెద్ద పండగలకు ఇది ప్రారంభం పండగ. ఈ సందర్భంగా డీమార్ట్ తీసుకువచ్చిన ప్రత్యేక ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం.
2/7డీమార్ట్ లో ప్రస్తుతం చాలామంది బ్రిటానియా జింజా పాప్స్ తీసుకుంటున్నారు. దాని ధర 120 రూపాయలు ఉంటే డీమార్ట్ లో 60 రూపాయలకే లభిస్తుంది. దేశవ్యాప్తంగా డీమార్ట్ లో ఎక్కువగా సేల్ అవుతున్న ఉత్పత్తి కూడా ఇదే. అలాగే బ్రిటానియా చీజ్ స్లైసెస్ కూడా బాగా కొంటున్నారు. దీని ధర 460 రూపాయలు ఉంటే డీమార్ట్ లో కేవలం 230 కే లభిస్తుంది. ఇంకా ఎక్కువ మంది షా అనే ఫ్రెష్ టాయిలెట్ క్లీనర్ కొంటున్నారు. ఇది లీటర్ 225 రూపాయలు ఉంటే మనకు డిమార్ట్ లో 112 రూపాయలకే లభిస్తుంది.
3/7ఆహారంలో చూస్తే ప్రజలు ఎక్కువగా యోగా బార్ మిల్లెట్ మ్యూస్లీ కొనుగోలు చేస్తున్నారు. దీని అసలు ధర 270 రూపాయలు ఉంటే డీమార్ట్ లో 160 రూపాయలకే లభిస్తుంది. ఇలాగే బికాజి చౌపతి బేల్ పూరి 110 గ్రాములది 49 రూపాయలు ఉంటే డీమార్ట్ లో 24 రూపాయలకే లభిస్తుంది. ఇలా చాలా వస్తువుల పైన అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది డిమార్ట్
4/7ఇక గ్రాసరీ విషయానికి వస్తే ఆర్గానికి తత్వ అర్హర్ తూర్ దాల్ కిలో 365 రూపాయలు ఉంటే డీమార్ట్ లో ఈ కందిపప్పును 182 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా సపోలో మిల్ మేకర్ 150 ఉంటే డీమార్ట్ లో 75 రూపాయలకే లభిస్తుంది. ఇక ఏపీస్ క్లాసిక్ సీడెడ్ ఖర్జూరాలు 1/2 కేజీ 199 ఉంటే 99 రూపాయలకే లభిస్తుంది. ఈస్ట్రన్ కారంపొడి అరకేజీ ప్యాకెట్ రెండు వందల రూపాయలు ఉంటే డీమార్ట్ లో 100 రూపాయలకే అమ్ముతున్నారు. ఇలా ఉప్పులు, పప్పులు, మసాలాలు, పొడులు, పలుకులు అన్నీ కూడా సగం ధరకే లభిస్తున్నాయి.
5/7ఇక పిల్లల చాక్లెట్లు బిస్కెట్లు కొనాలనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే డీమార్ట్ లో సన్ ఫిస్ట్ డ్రగ్ ఫాంటసీ యమ్మీ ఫీల్ పై ప్యాకెట్ 150 లభిస్తుంది .అంటే సగం ధర కట్టి తక్కువకే లభిస్తుంది అని చెప్పవచ్చు. 400 గ్రాములది 150 రూపాయలు ఉంటే దీనిని 75 రూపాయలకే అమ్ముతున్నారు. మీరు కరాచీ బిస్కెట్ కొనాలనుకుంటే 400 గ్రాముల ప్యాకెట్ . 180 రూపాయలు ఉంటుంది. అదే డీమార్ట్ లో 90 రూపాయలకే లభిస్తుంది. ఇలా దాదాపు 100 రకాల బిస్కెట్లు చాక్లెట్ల పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.
6/7కిచెన్ లో పెద్ద వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే బటర్ఫ్లై స్టెయిన్లెస్ ఔటర్ లిస్ట్ కుక్కర్ ఐదు లీటర్లది అసలు ధర 4800 ఉంటే డీమార్ట్ లో 19,49కే కొనుగోలు చేయవచ్చు. అంటే మనకు దాదాపు 3000 రూపాయలు ఆధావుతుంది. ఇక వీటితోపాటు సోప్స్ లైవ్ సంతూర్ సబ్బులు డీమార్ట్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
7/7గ్రేస్ బి వెల్ కాది హ్యాండేడ్ 20 చాలా కంపెనీ ఉత్పత్తులు కూడా సగం ధరకే లభిస్తున్నాయి. ఇక జార్లు, కంటైనరు, అప్లయెన్సెస్ హోమ్ అండ్ కిచెన్ ఐటమ్స్, బాత్ ఐటమ్స్ ,బ్యాగులు, డైరీ బేవరేజ్, కూల్ డ్రింక్స్, ఫర్నిచర్, క్లాతింగ్ ఇలా చాలా ఐటమ్స్ తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై 60 నుంచి 70శాతం డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి వాటన్నిటిని ఇప్పుడు మనం తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ వారంలో డిమార్ట్ కి వెళ్లేవారు త్వరగా కాకుండా నెమ్మదిగా షాపింగ్ చేయడం ద్వారా పూర్తి ఆఫర్లు తెలుసుకొని సగం ధరకి ఉన్నవాటిని కొనుగోలు చేస్తే భారీగా డబ్బును ఆదా చేసుకోవచ్చు.