Curd in Fasting: ఉపవాసం చేసేటప్పుడు తినే ఆహారాన్ని సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు మనల్ని అలసిపోయేలా చేస్తాయి. మరికొన్ని మనల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. అయితే అలాంటి వాటిలో పెరుగు చాలా మంచి ఆప్షన్. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మన సంస్కృతిలో కూడా దీనికి ప్రత్యేక స్థానం ఉంది. పెరుగు మనసుకు శాంతినిస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది.
1/5మీరు ఫాస్టింగ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటిలో పెరుగు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. పెరుగు తినడం వల్ల శక్తి వస్తుంది. ఆకలి తక్కువగా వేస్తుంది. 100 గ్రాముల పెరుగులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 98 కేలరీలు కూడా ఉంటాయి. దీనిలోని కేసిన్ అనే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల కడుపు నిండినట్టు అనిపిస్తుంది. తరచుగా ఆకలి వేయదు.
2/5పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల.. శరీరానికి పోషకాలు సరిగ్గా అందేలా చేస్తాయి. అంతేకాకుండా శరీరంలో వేడిని తగ్గించి.. జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతాయి. పెరుగును ఉపవాసం సమయంలో తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి.. ఒత్తిడిని తగ్గిస్తుంది.
3/5పెరుగు కడుపులో ఆమ్లత్వాన్ని సమతుల్యం చేసి.. ఎసిడిటీని తగ్గిస్తుంది. ఉపవాసం చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండటం వల్ల గుండెల్లో మంట రావచ్చు. పెరుగు పీహెచ్ స్థాయి 4.5 నుంచి 5.5 మధ్య ఉంటుంది. ఇది అదనపు ఆమ్లాన్ని నియంత్రిస్తుంది.
4/5పెరుగు శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను తిరిగి తెచ్చుకుంటుంది. చెమట వల్ల లేదా ఇతర కారణాల వల్ల పొటాషియం సోడియం లాంటివి తగ్గుతాయి. ఉపవాసంలో ఇది మరింత పెరుగుతుంది. పెరుగులో 75 శాతం కన్నా ఎక్కువ నీరు ఉంటుంది. కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది శరీరాన్ని తేమగా ఉంచుతుంది. కండరాల తిమ్మిరి, అలసటను తగ్గిస్తుంది.
5/5ఉపవాస సమయంలో పెరుగు తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. హైడ్రేషన్ ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. రైతాగా చేసి తినవచ్చు. పండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చు.