Vijay Devarakonda Rashmika Age Gap: విజయ్ దేవరకొండ, రష్మికల గురించి తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితమే. వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నారు. కానీ ఆ విషయాన్ని వీళ్లిద్దరు ఎపుడు పెద్దగా రివీల్ చేయలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
1/5Vijay Devarakonda Rashmika Age Gap: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ జంట ఎపుడు పార్టీలకు వెళ్లినా.. కలిసి దర్శనమిచ్చేవారు. అంతేకాదు వీళ్లిద్దరు వెకేషన్ కోసం జంటగా వెళ్లిన సందర్భాలున్నాయి. అపుడుపుడు ఎయిర్ పోర్ట్ లో వీళ్లిద్దరు కలిసి కనిపించి వాటికి బలం చూకూర్చేవారు. తాజాగా వీళ్లిద్దరు నిశ్చితార్దం చేసుకొని ఆ రూమర్స్ కు పులిస్టాప్ పెట్టారు.
2/5ఇక వీళ్లిద్దరి పెళ్లి వచ్చే యేడాది ఫిబ్రవరి అంటే మాఘ మాసంలో జగరబోతున్నట్టు సమాచారం. వీళ్లిద్దరి పెళ్లి వచ్చే ఫిబ్రవరి 12న జరగనున్నట్టు సమాచారం. అది కూడా రష్మిక సొంతూరు మంగళూరులో ఓ ప్యాలెస్ లో జరగబోతున్నట్టు సమాచారం. ఈ వేడుకకు తెలుగు, హిందీ సహ వివిధ సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు బడా హీరోలు, సెలబ్రిటీలు హాజరు కానున్నట్టు సమాచారం.
3/5ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కూడా పూర్తైయినట్టు సమాచారం. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నారట. దీనికి సంబంధించిన త్వరలో అన్ని వివరాలు బయటకు రానున్నాయి.
4/5త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏజ్ గ్యాప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ..9 మే 1989లో జన్మించారు. అటు రష్మిక మందన్న.. 5 ఏప్రిల్ 1996లో జన్మించారు. ఇద్దరు మధ్య ఏజ్ గ్యాప్ 7 యేళ్లు ఉంది.
5/5అయితే ప్రస్తుతం ఏజ్ గ్యాప్ పెద్ద మ్యాటర్ కాదంటున్నారు. మనుసులు కలవడమే పెద్ద విషయం అని చెబుతున్నారు. వీళ్లిద్దరు ప్రస్తుతం తమ తమ సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా కెరీర్ కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉందట. అందకు విజయ్ కూడా ఒప్పుకోవడంతో ఇరు కుటుంబాలు కూడా ఓకే అనడంతో వీళ్లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. త్వరలో పెళ్లి డేట్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడనుంది.