Add Zee Business As A Preferred Source
App

Pawan Kalyan 1st Wife: పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఎవరు..! ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..

Written ByTA Kiran Kumar
Published: Sep 02, 2025, 06:39 AM IST|Updated: Sep 02, 2025, 06:40 AM IST

Pawan Kalyan 1st Wife Nandini Details: పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ గా అభిమానులు ఆయన్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. కానీ ప్రత్యర్దులు మాత్రం వీలు చిక్కినపుడల్లా ఆయన మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తీసుకొస్తుంటారు. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు లేకపోవడంతో ఆయన మూడు పెళ్లిళ్ల గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే.. ఈయన మొదటి సారి పెళ్లి చేసుకున్నది ఎవరు.. ? ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయానికొస్తే.. 

Pawan Kalyan 1st Wife Nandini Details1/5

పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని

Pawan Kalyan 1st Wife Nandini Details: పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. జనసేనానిగా 2024 ఎన్నికల్లో ఏపీ, కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటంలో కీలక భూమిక వహించారు.అందరికీ  పవన్ రెండో భార్య రేణు దేశాయ్ తో పాటు మూడో భార్య అన్నా లెజ్నెవా  గురించి తెలుసు. కానీ మొదటి భార్య  గురించి చాలా తక్కువ మందికే తెలుసు. 

Akkada Ammayi Ikkada Abbayi 2/5

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

పవన్ కళ్యాణ్ మొదటి భార్య ప్రస్తుతం ఏం చేస్తున్నారనే అనేది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలుసుకోవాలనే కోరిక ఉంది. పవన్ కళ్యాణ్   1996లో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా వెండితెరకు ఇంట్రడ్యూస్ అయ్యారు. 

 

Pawan Kalyan First Wife 3/5

పవన్ కళ్యాణ్ మొదటి వివాహాం

కథానాయకుడిగా పరిచయమైన తర్వాత  పవన్ కళ్యాణ్ ఆ తర్వాత యేడాదే.. 1997లో నందిని అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్నాడు. నందినిది విశాక పట్నం. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 

Pawan Kalyan First Wife 4/5

పవన్ కళ్యాణ్ ఫస్ట్ భార్య

ఆ తర్వాత ఆమె తన పేరు మార్చుకొని 2010లో అమెరికాలో ఓ ఎన్నారై డాక్టర్ కృష్ణారెడ్డిని 2010లో రెండో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 

Renu Desai 5/5

రేణు దేశాయ్

ఆ తర్వాత పవన్ కళ్యాణ్  2007లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణు దేశాయ్ ను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటికే వీరికి ఒక అబ్బాయి అకిరానందన్ ఉన్నాడు. ఆ తర్వాత రెండో భార్య రేణుకు విడాకులు ఇచ్చిన రష్యన్ యువతి అన్నా లెజ్నెవాను  మూడో పెళ్లి  చేసుకున్నారు పవన్ కళ్యాణ్.