Add Zee Business As A Preferred Source
App

HBD Pawan Kalyan: అన్నయ్య చిరంజీవి పుట్టినరోజున విడుదలైన పవన్ కళ్యాణ్ ఏకైక చిత్రం ఏదో తెలుసా.. !

Written ByTA Kiran Kumar
Published: Sep 01, 2025, 01:25 PM IST|Updated: Sep 01, 2025, 01:28 PM IST

Pawan Kalyan Movie Released on Chiranjeevi Birthday: పవన్ కళ్యాణ్ .. ఈ పేరు ఫ్యాన్స్ కు ఓ  తారక మంత్రం. ప్రస్తుతం జనసేనానిగానే కాకుండా..ఏపీ డిప్యూటీ సీఎంగా.. సినిమా నటుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఇక ఈయన కెరీర్ లో నటించిన ఓ చిత్రం అన్నయ్య బర్త్ డే కానుకగా విడుదలై పవన్ కళ్యాణ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. 

Chiranjeevi Birthday1/6

పవన్ కళ్యాణ్ చిరంజీవి

Pawan Kalyan Movie Released on Chiranjeevi Birthday: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెబితే  ఫ్యాన్స్ కు  పూనకాలే. ఈయన అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. చిరంజీవి నట వారసుడిగా  గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాతగా ఇవివి సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. 

Ikkada Ammayi Ikkada abbayi 2/6

అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి

అప్పట్లో అంటే 1996లో ఈ సినిమాను వెరైటీగా ప్రమోషన్స్ చేశారు. ఈ అబ్బాయి ఎవరు అంటూ హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అప్పటి నగరాల్లో వేసిన ఈ పోస్టర్స్ ఈ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనపడ్డ తొలి చిత్రంలో  పవన్ కళ్యాణ్ కాకుండా.. కళ్యాణ్ అని ఉంటుంది. అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా వెరైటీగా  ఈ సినిమాలో కళ్యాణ్ పేరుతోనే నటించడం విశేషం.  

 

Pawan Kalyan 3/6

పవన్ కళ్యాణ్

ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్.. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో  రెండో సినిమా ‘గోకులంలో సీత’ చేసాడు. ఈ సినిమా నుంచే కళ్యాణ్ బాబుగా ఉన్న తన పేరును ‘పవన్ కళ్యాణ్’ అయ్యాడు. కొణిదెల కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు.అప్పట్లో అన్నయ్య శివ శంకర్ వర ప్రసాద్ నుంచి ఆంజనేయ స్వామి మారు పేరుగా ఉన్న చిరంజీవినే తన  పేరు మార్చుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో  మెగాస్టార్ అయ్యారు.  ఆ పేరు మహత్యమూ  ఏమో.. చిరంజీవి సినీ రంగంలో  ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నారు. 

Pawan Kalyan 4/6

పవన్ కళ్యాణ్

అటు పవన్ కళ్యాణ్ కూడా హనుమంతుడి పేరు వచ్చేలా కళ్యాణ్ పేరు ముందు పవన్ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యాడు. హనుమాన్ మహత్యమో ఏమో .. పవర్ స్టార్ గా ఎదిగారు.అంతేకాదు రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు.త్వరలో ముఖ్యమంత్రిగా ఆయన్ని చూడాలనుకుంటున్నారు అభిమానులు. 

 

Gokulamlo seetha 5/6

గోకులంలో సీత

ఇక పవన్ కళ్యాణ్ రెండో చిత్రం ‘గోకులంలో సీత’ సినిమాలో తన సొంత పేరు పవన్ కళ్యాణ్ పేరుతో నటించడం విశేషం. ఆ సినిమా తర్వాత మరే ఇతర సినిమాల్లో పవన్ కళ్యాణ్ తన సొంత పేరుతో నటించలేదు. ఈ సినిమా అప్పట్లో 1997లో చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న విడుదలైంది. పవన్ నటించి ఓ చిత్రం ఆయన అన్నయ్య చిరు బర్త్ డేనే విడుదల కావడం విశేషం. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున ఇప్పటి వరకు ఆయన చిత్రం ఏది విడుదల కాలేదు. భవిష్యత్తులో పవన్ బర్త్ డే రోజున ఏదైనా సినిమా విడుదలైతే చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు. 

Pawan Kalyan AP Politics 6/6

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ చిత్రంతో పలకరించారు. ఈ సినిమా తర్వాత ఈ నెల 25న తన బర్త్ డే మంత్ రోజున ‘ఓజీ’ సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.