Tabu Relation between Sr NTR: తెలుగు, హిందీ సహా ప్యాన్ ఇండియా నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ‘టబు’. ఈమెకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీతో అనుబంధం ఉంది. ఎలా అనుకుంటున్నారా.. అవును టబు స్వస్థలం తెలంగాణ కావడం విశేషం. అందులో రాజధాని హైదరాబాద్ పాతబస్తీలో పుట్టి పెరిగిన టబు.. ఆ తర్వాత కొన్నాళ్లకు వీళ్ల ఫ్యామిలీ ముంబైకు షిఫ్ట్ అయింది.
1/7
Tabu Relation between Sr NTR:తబుస్సుమ్ హష్మి. 1971 నవంబర్ 4 న హైదరాబాద్ లో జన్మించారు.. తండ్రి జమాల్ హష్మి, తల్లి రిజ్వానా. ప్రముఖ నటీమణి షబానా అజ్మీ, ఫోటోగ్రఫర్ కమ్ నటుడు బాబా అజ్మీలకి టబు స్వయానా మేనకోడలు. 1980లోనే బాలనటిగానే సినీ రంగ ప్రవేశం చేసింది. 'బజార్' అనే చిత్రంలో బాలనటిగా ఓ చిన్న పాత్ర పోషించింది. తర్వాత ఐదేళ్లకు 'హమ్ నౌ జవాన్' లో దేవానంద్‌కి కూతురిగా నటించింది. పద్నాలుగేళ్ల వయసులో చేసిన ఆ పాత్ర ద్వారా టబు బాలీవుడ్ లో ఆకట్టుకొంది.
2/7హీరోయిన్ గా ఆమె నటించిన తొలి సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ 1. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే ఫస్ట్ మూవీతోనే అందరి చూపూ తనవైపు తిప్పుకుంది. ఎవరీ హాట్ బ్యూటీ.. అనుకునేలా చేసింది. ఆ తర్వాత హిందీలో ‘పహ్లా పహ్లా ప్యార్’ మూవీతో లీడ్ యాక్ట్రెస్ గా ప్రవేశించింది. ఆ తర్వాత వచ్చిన ‘విజయ్ పథ్’ సినిమాతో ఈమెను విజయాలు వరిస్తూనే ఉన్నాయి.
3/7టబు నటించిన సినిమాల్లో 1996 లో వచ్చిన మరో సెన్సేషనల్ మూవీ ప్రేమ దేశం. ఈ సినిమా.. తమిళంలో వచ్చిన కాదల్ దేశం సినిమాకు డబ్బింగ్. దివ్య క్యారెక్టర్లో టబు ఇచ్చిన గ్లామరస్ పర్ఫామెన్స్ కు అందరు ఫిదా అయ్యారు.
4/7టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఇలా అందరితో కలిసి నటించింది. ఆమె కెరియర్లో ఎక్కువగా నటించింది హిందీ చిత్రాల్లోనే. కొన్ని తమిళ్, తెలుగు, మలయాళం, మరాఠీ, బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె యాక్ట్ చేసింది.మెగాస్టార్ తో కలిసి అందరివాడు సినిమాలో నటించింది టబు. ఆ సినిమాలో యాక్టింగ్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది.
5/7తెలుగులో ఎక్కువగా నటించింది... నాగార్జున కాంబినేషన్లోనే. వీరి జోడికి హిట్ పెయిర్ టాక్ వచ్చింది. నిన్నే పెళ్లాడతా సినిమాలో టబు అందాలకు టాలీవుడ్ లో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఈయనతో ఆవిడా మా ఆవిడే సినిమాలో నటించింది.
6/7బాలకృష్ణ కాంబినేషన్లో రెండు మూవీల్లో నటించింది టబు. పాండురంగడు సినిమాలో ఆమె గ్లామర్ కు ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్లర్లో నటించి.. ఆడియెన్స్ కు వేడి పుట్టించింది. ఆ తర్వాత చెన్నకేశవ రెడ్డిలో నటించి మెప్పించింది. ఇక ఈమె అన్న ఎన్టీఆర్ తో ఓ రిలేషన్ ఉంది. ఈమె మేనత్త షబానా అజ్మీ.. భర్త జావేద్ అఖ్తర్.. తన తోటి మిత్రుడు సలీమ్ ఖాన్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. అందులో ఎన్టీఆర్ నటించిన నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం,యుగంధర్, నా దేశం వంటి సినిమాలున్నాయి.
7/7అంతేకాదు షబానా అజ్మీ.. ఫ్యామిలీ.. తన కుటుంబంతో కలిసి మెహదీపట్నంలో మకాం మార్చారు. అక్కడ వీరు ఎన్టీఆర్ ఇంటి సమీపంలోనే ఉండేవారు. దాదాపు పక్క పక్క ఇళ్లే వీళ్లిద్దరివి. అలా టబు మేనత్త.. భర్త కథ అందించిన సినిమాల్లో ఎన్టీఆర్ నటించడమే కాకుండా.. వాళ్ల పొరుగువాళ్లు కావడం విశేషం. ఇక టబు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణతో కలిసి రెండు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే కదా.