Add Zee Business As A Preferred Source
App

Best Foods for Liver: మీకు రెగ్యులర్‌గా ప్రకృతిలో దొరికే ఈ మూడు తింటే చాలు.. మీ లివర్ సూపర్ స్ట్రాంగ్‌గా మారడం ఖాయం..!

Written ByAruna Maharaju
Published: Sep 03, 2025, 03:17 PM IST|Updated: Sep 03, 2025, 03:17 PM IST

Liver Disease Diets: ఇప్పటి ఆధునిక జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, మద్యం ఎక్కువగా తాగడం లివర్ దెబ్బతినటానికి కొన్ని ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో కొన్ని ప్రకృతి ప్రసాదించిన  మూలికలతో మన లివర్‌ని హెల్తీగా మార్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  
 

Ayurvedic For Fatty Liver1/5

ఉసిరికాయ

ఉసిరికాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది లివర్‌‌ని శుభ్రం చేస్తుంది. లివర్‌‌ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉసిరికాయను తాజాగా తినవచ్చు లేదా రసం, క్యాండీ రూపంలో తీసుకోవచ్చు.

Fatty Liver2/5

అలోవెరా

అలోవెరా కూడా లివర్‌ ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్‌‌ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు, మూడు టీస్పూన్ల అలోవెరా రసాన్ని సమాన పరిమాణంలో నీటితో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. 

Ayurvedic For Fatty Liver3/5

పునర్నవ మూలిక

పునర్నవ మూలిక లివర్‌లో వాపు సమస్యను తగ్గిస్తుంది. దీన్ని పొడి లేదా సిరప్ రూపంలో తీసుకోవచ్చు. ఎంత మోతాదు తీసుకోవాలో ఆయుర్వేద వైద్యుడిని సంప్రదిస్తే సలహా ఇస్తారు.  

Fatty Liver4/5

లివర్‌

లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగాలి. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కీర, క్యారెట్, సొరకాయ, పండ్లు, పప్పులు వంటివి లివర్‌‌కి మంచివి. మద్యం లివర్‌‌ని తీవ్రంగా దెబ్బతీస్తుంది కాబట్టి దాన్ని పూర్తిగా మానేయాలి.   

Ayurvedic For Fatty Liver5/5

లివర్‌ ఆరోగ్యం

రోజూ ముప్పై నిమిషాలు వ్యాయామం, యోగా లేదా ప్రాణాయామం చేయడం వల్ల లివర్‌ పనితీరు మెరుగవుతుంది. ఒత్తిడి కూడా లివర్‌ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి టెన్షన్ తగ్గించుకోవాలి.