Add Zee Business As A Preferred Source
App

Health Tips: గ్రీన్ టీ.. బ్లాక్ టీ.. లెమన్ టీ.. ఇవేమి కాదు.. ఒక్కసారి దానిమ్మ తొక్క టీ తాగండి.. ఒంట్లో కొవ్వు మొత్తం కర్పూరంలా కరగిపోతుంది..!

Written ByAruna Maharaju
Published: Sep 12, 2025, 05:46 PM IST|Updated: Sep 12, 2025, 05:46 PM IST

Pomegranate Peel Tea: దానిమ్మ పండుని రోజు తినడం వల్ల శరీరానికి అనేకరకాల పోషకాలు అందుతాయి. అందరూ దానిమ్మ గింజలని మాత్రమే తింటూ.. దాని తొక్కలను పడేస్తారు. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే.. దానిమ్మ పండుతోనే కాదు.. దాని తొక్కలతో చేసే టీతోనూ బోలెడు ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
 

Pomegranate Peel Tea Uses In Telugu1/5

దానిమ్మ తొక్కలతో టీ

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచికి పుల్లగా ఉన్నా, చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు. కానీ దానిమ్మ గింజలతో పాటు దాని తొక్క కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. దానిమ్మ తొక్కతో చేసే టీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ టీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, టానిన్స్, ఫ్లావనాయిడ్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. 

Pomegranate Peel Tea Benefits2/5

దానిమ్మ తొక్కలతో చేసిన టీతో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ టీ జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోజూ ఒక కప్పు టీ తాగితే గొంతు సమస్యలు త్వరగా తగ్గుతాయి. దంత నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మౌత్‌వాష్‌గా కూడా వాడొచ్చు.   

Pomegranate Peel Tea3/5

దానిమ్మ తొక్కలు

అంతేకాకుండా రోజు ఖాళీ కడుపున ఈ టీ తాగితే ఒంట్లో కొవ్వు కూడా కరిగిపోయి.. మీరు నాజుగ్గా మారడంలో సాయపడుతుంది. ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తనాళాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.   

Pomegranate Peel Tea Health Benefits4/5

దానిమ్మ పండు

ఇక జీర్ణ సమస్యలైన డయేరియా, అజీర్తి వంటివి తగ్గడానికి కూడా ఈ టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఈ టీలో ఉండటం వల్ల వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.   

Pomegranate Peel Tea5/5

దానిమ్మ తొక్కలు

ఈ టీని తయారు చేయడం సులభం. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఒక కప్పు నీటిలో 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. చల్లారిన తర్వాత వడపోసి, తేనె లేదా నిమ్మరసం కలిపి తాగొచ్చు. గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయిన వారు వైద్యుల సలహా తీసుకోవాలి. రోజుకు ఒక కప్పు తాగడం సరిపోతుంది. దంత సమస్యలు ఉన్నవారు కూడా వైద్యుల సూచనతోనే ఈ టీని వాడాలి.