Lotus Roots: తామర పువ్వు (Lotus Flower) ఎంతో అందంగా ఉంటుంది. ఈ ఫ్లవర్‌ని చాలా మంది అలంకరణకు, అందం కోసం ఉపయోగిస్తారు. అయితే తామర పువ్వే కాకుండా.. వాటి వేర్లతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5తామర వేర్లు కేవలం అందానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇందులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. తామర వేర్లలో విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
2/5తామర వేర్లు తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. అందుకే తిన్నాక పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది ఎక్కువ ఆహారం తినకుండా నియంత్రిస్తుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగు చేస్తుంది. మలబద్ధకం, ఆమ్లత వంటి సమస్యలను తగ్గిస్తుంది. కాలేయాన్ని శుభ్రం చేయడంలోనూ ఉపయోగపడుతుంది.
3/5ఈ వేర్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి.
4/5తామర వేర్లలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. అలాగే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి.
5/5తామర వేర్లను కూరగా చేసుకోవచ్చు. ముక్కలుగా కట్ చేసి వేయించి తినవచ్చు. తులసితో కలిపి టీలా తాగవచ్చు. చిప్స్, స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. ఇలా తామర వేర్లు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.