Cristiano Ronaldo Vs Lionel Messi Net Worth: ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల గురించి క్రీడాభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయర్లుగా ఎదిగారు. అయితే ఇద్దరిలో ఎవరు అత్యధికంగా సంపాదించారు..? ఎవరి వద్ద ఎన్ని కార్లు ఉన్నాయి..? వారి ఆస్తులు ఎంత..? వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
1/9రీసెంట్‌గా ఉన్న నికర విలువ ఆస్తుల లెక్కల ప్రకారం.. రొనాల్డో 1.4 బిలియన్ల డాలర్లు మార్కును దాటి బిలియనీర్ అయ్యాడు. సంపాదన రేసులో మెస్సీ కంటే కాస్త ముందే ఉన్నాడు.
2/9ఈ ఏడాదే రొనాల్డో అధికారికంగా బిలియనీర్ మార్కును చేరుకున్నాడు. అల్-నాస్ర్‌లో భారీ ఒప్పందం, హోటళ్ల నుంచి CR7 బ్రాండ్ వరకు డిఫరెంట్ బ్రాండ్ సంస్థలకు రొనాల్డో అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
3/9ఇంటర్ మయామి టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం.. ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, వ్యక్తిగత వ్యాపారాల ద్వారా మెస్సీ కూడా గట్టిగానే సంపాదిస్తున్నాడు. తాజా డేటా ప్రకారం. మెస్సీ నికర ఆస్తుల 650 మిలియన్లు డాలర్లుగా ఉంది.
4/9రొనాల్డో వద్ద చాలా కార్లు ఉన్నాయి. అరుదైన బుగట్టి సెంటోడీసి, బుగట్టి చిరోన్, ఫెరారీ, రోల్స్ రాయిస్, లంబోర్ఘినితోపాటు సూపర్ కార్లను రొనాల్డో కొనుగోలు చేశాడు.
5/9ఇక మెస్సీ వద్ద ఫెరారీ 335 ఎస్ స్పైడర్ స్కాగ్లియెట్టి, పగని జోండా ట్రైకలోర్, మెర్సిడెస్ SLS AMG వంటి కార్లతోపాటు అనేక లగ్జరీ SUVలు కూడా కొనుగోలు చేశాడు.
6/9ఇటలీలోని టురిన్‌లో క్రిస్టియానో రొనాల్డోకు విలాసవంతమైన భవనం ఉంది. దీని విలువ 6.5 మిలియన్ల డాలర్ల నుంచి 10 మిలియన్ల డాలర్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు.
7/9లియోనెల్ మెస్సీకి ఫ్లోరిడాలో భారీ భవనం ఉంది. దీని విలువ 10.8 మిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భవనంలో 10 బెడ్‌రూమ్‌లు, 8 బాత్రూమ్‌లు ఉన్నాయి.
8/9ఇద్దరు ఆటగాళ్లు రియల్ ఎస్టేట్, ప్రైవేట్ జెట్‌లు, బ్రాండ్ ఒప్పందాలలో ఇన్వెస్ట్ చేశారు. అయితే రొనాల్డో భారీ ఒప్పందాలు, వ్యాపారాలు ఎక్కువగా ఉండడంతో సంపాదన కూడా ఎక్కువగానే ఉంది.
9/9ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న ప్లేయర్‌గా క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. ఆస్తుల విషయం పక్కనబెడితే.. ఆటలో మాత్రం ఎవరికి వారే సాటి. మెస్సీ ఈ నెల 13న తెలంగాణలో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌తో ప్రత్యర్థిగా మెస్సీ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.