Add Zee Business As A Preferred Source
App

Double Jackpot To Employees: 3 శాతం డీఏ పెంపు.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌!

Published: Oct 02, 2025, 02:34 PM IST|Updated: Oct 02, 2025, 02:34 PM IST

Double Jackpot To Govt Employees A Head Of 3 Percent DA Hike: కేంద్ర మంత్రివర్గం ౩ శాతం డీఏ పెంపుతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. ఈ క్రమంలో ఈపీఎఫ్‌ సభ్యులకు భారీ లబ్ధి జరగనుంది. వారికి డబుల్‌ ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేటు ఉద్యోగులకు లభించనున్న ప్రయోజనం వివరాలు ఇలా ఉన్నాయి.

1/6

3 శాతం కరువు భత్యం పెంపుతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఈపీఎఫ్‌ సభ్యులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు డబుల్‌ ప్రయోజనం లభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2/6

దీపావళి కానుకగా ఈపీఎస్‌-95 పథకం కింద పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్‌ను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) రెండున్నర రెట్లు పెంచనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపుతో ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. దీని తర్వాత ఇప్పుడు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కూడా దీపావళి బహుమతి లభించింది. 

3/6

దీపావళి కానుకగా ఈపీఎఫ్‌-95 పథకం కింద పెన్షనర్లకు కనీస నెలవారీ పెన్షన్‌ను ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండున్నర రెట్లు పెంచనుంది. ఈపీఎస్‌-95 పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.2,500కు పెంచే అవకాశం ఉంది. ఈ సవరణ పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఇబ్బందులు పడుతున్న 23 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది.

4/6

ఈపీఎఫ్‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) అక్టోబర్ 10 నుంచి 11వ తేదీ వరకు బెంగళూరులో సమావేశం కానుంది. కేంద్ర కార్మిక మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపు, ఇతర సంస్కరణలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. 

5/6

కనీస పెన్షన్‌ను రూ.వెయ్యి నుంచి రూ.7 వేలకు పెంచాలని కార్మిక సంఘాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తుండడంతో ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీబీటీ కొత్త కనీస పెన్షన్‌ను రూ.2,500కి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.

6/6

కనీస పెన్షన్‌ను రూ.2,500కు పెంచితే చాలా మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నెలవారీ పెన్షన్‌లో 2.5 రెట్లు పెరుగుదల కనిపిస్తుంది. ఇది అధిక వేతనాలు ఉన్నవారికి ప్రయోజనం కలగకపోగా.. తక్కువ వేతనాలకు భారీ ప్రయోజనం లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ పెంపుతో పెన్షనర్లకు ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇది జరిగితే రిటైర్డ్ ఉద్యోగులపై ద్రవ్యోల్బణ భారం తగ్గుతుంది.