8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు 2025లో డబుల్‌ జాక్‌పాట్‌.. అర లక్షకు పెరగనున్న జీతం

Govt Employees In 2025 Basic Salary Increase Double With 8th Pay Commission: కాల గర్భంలో మరో ఏడాది కలిసిపోనుండగా.. కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్ తగలనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2025 సంవత్సరంలో 2 శుభవార్తలు ఉండనున్నాయి. దీంతో పింఛన్‌దారులకు.. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. దీంతో ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఏడాది వెలుగులు నింపబోతున్నది.

1 /8

కొత్త ఏడాది: కొత్త సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు రెండు జాక్‌పాట్‌లు లభించనుంది.

2 /8

అంచనా ఇలా: 8వ పే కమిషన్ నోటిఫికేషన్ పే పెంపును నిర్ధారిస్తుంది. 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

3 /8

ఎదురుచూపులు: 8వ వేతన సంఘం ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ వేతన సంఘం ఏర్పాటుకు సమయం ఆసన్నమైంది.

4 /8

భారీ ఆశలు: రానున్న కేంద్ర బడ్జెట్‌లో 8వ వేతన సంఘానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆశిస్తున్నారు.

5 /8

ప్రతిపాదనలు: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ ఆర్గనైజేషన్స్ (ఎన్‌సీ-జేసీఎం) ఉద్యోగులకు వేతన ఇంక్రిమెంట్‌లను ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఆధారంగా లెక్కించాలని ప్రతిపాదించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇటీవల నివేదికల ప్రకారం వేతనాలు 2.86 రెట్లు పెరుగుతాయి.

6 /8

మూల వేతనం: ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం రూ.18,000 నుంచి రూ.51,480కి పెరుగుతుందని అంచనా. దీంతో జీతం భారీగా పెరగనుంది.

7 /8

ఫిట్‌మెంట్‌ ఫ్యాక్టర్‌: వేతనాలు, పెన్షన్‌లను లెక్కించడానికి 'ఫిట్‌నెస్ ఫ్యాక్టర్' వినియోగిస్తారు. 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయించబడింది. దీంతో మూల వేతనం రూ.7 వేల నుంచి రూ.18,000కు పెరిగింది.

8 /8

పింఛన్‌ భారీగా: 8వ వేతన కమిషన్‌లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చితే.. రిటైర్డ్ ఉద్యోగులపై కూడా 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేస్తే పింఛనుదారుల ప్రాథమిక పెన్షన్ రూ.25,740కు పెరుగుతుంది.