Add Zee Business As A Preferred Source
App

Aadhaar Card: ఆధార్‌కార్డును వాట్సాప్‌లోనే ఇలా సులభంగా ఎప్పుడంటే అప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకోండి..

Written ByRenuka Godugu
Published: Sep 25, 2025, 04:51 PM IST|Updated: Sep 25, 2025, 04:51 PM IST

Download Aadhaar Card With WhatsApp: ఆధార్ కార్డు అనేది ఒక గుర్తింపు కార్డు. ప్రతి భారతీయుడు కలిగి ఉండాల్సిందే. దీన్ని సులభంగా వాడవచ్చు. అయితే గవర్నమెంట్ ఈ ఆధార్ కార్డును ప్రతి ఒక్కరికి అందించింది. అయితే ఆధార్ కార్డును ఫిజికల్ కార్డుగా మాత్రమే కాకుండా వాట్స్అప్ లో కూడా మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై గవర్నమెంట్ హెల్ప్ డెస్క్ చాట్‌బాట్‌ ద్వారా ఇది అందుబాటులో ఉంది. అది ఎలాగో తెలుసుకుందాం.. 
 

Hard Copy1/5

హార్డ్ కాపీ

ఆధార్ కార్డు మన వద్ద ఫిజికల్ కార్డు, హార్డ్ కాపీలు ఉంటాయి. అయితే ప్రతి సందర్భంలో మన వద్ద ఆధార్‌ కార్డు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో యుఐడిఏ పోర్టల్‌ ద్వారా లేదా డీజీ లాకర్ యాప్ ద్వారా ఆధార్ కార్డు యాక్సెస్ చేయవచ్చు. అయితే వీటితో కాకుండా నేరుగా వాట్సాప్ ద్వారా కూడా మీరు సులభంగా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  

Whatsapp2/5

 వాట్సాప్

 వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. దీనికి ముందుగా మీ వద్ద యాక్టివ్ డీజీ లాకర్ ఖాతా ఉండాలి. అధికారిక మై గవర్నమెంట్ హెల్ప్ డెస్క్ వాట్సాప్ నంబర్ అయినా 9013151515 అందరూ మీ కాంటాక్ట్ లో సేవ్ చేసుకొని ఉండాలి.   

Help Desk3/5

హెల్ప్ డెస్క్

ఆ తర్వాత మై గవర్నమెంటు హెల్ప్ డెస్క్ నెంబర్ అయినా 9013151515 వాట్సాప్ లో ఓపెన్ చేసి 'Hi' లేదా నమస్తే అని టైప్ చేయండి. ఇప్పుడు మీ చాట్ బాట్‌ మెనూ లో డీజీ లాకర్ సర్వీస్ ఎంచుకోండి.  

Digi Loacker4/5

డీజి లాకర్‌

ఆ తర్వాత మీ డీజి లాకర్‌ ఒకరు ఖాతాను కన్ఫామ్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆథాంటికేషన్ పూర్తయిపోయిన తర్వాత మీ చాట్ బాట్ లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ని డిస్‌ప్లే అవుతుంది. అక్కడ మీ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని పీడీఎఫ్‌ రూపంలో వాట్సాప్‌లో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోండి   

Download5/5

డౌన్‌లోడ్

 ఒకేసారి కేవలం ఒక్క డాక్యుమెంట్ మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ముఖ్యంగా మీరు ఆధార్ డీజి లాకర్ తో లింక్ చేసి ఉండాలి. ఇది డిజిలాకర్‌ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.