Water Intake: శరీరానికి నీరు చాలా అవసరం. కానీ నీరు ఎక్కువ తాగితే బరువు తగ్గుతారనే అపోహలు.. చాలామందిలో ఉన్నాయి. నిజానికి ఎంత నీరు తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుందో తెలుసుకోవడం ముఖ్యం.
1/6మన శరీరంలో 60 శాతం భాగం నీటితోనే ఉంటుంది. కాబట్టి సరైన మోతాదులో నీరు తాగడం చాలా అవసరం. చాలా మంది ..ఎక్కువ నీరు తాగితే బరువు తగ్గిపోతుంది..అని భావిస్తారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. నీటిని సరైన సమయానికి.. సరైన మోతాదులో తాగితేనే అది శరీరానికి మేలు చేస్తుంది.
2/6నిపుణుల సూచనల ప్రకారం..రోజుకు 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగడం ఉత్తమం. ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగడం జీర్ణక్రియకు మంచిది. భోజనం ముందు నీరు తాగడం.. ఆకలి తగ్గించడంలో సహాయపడుతుంది..దీని వల్ల మనం తక్కువగా తింటాము. ఇలా చేయడం బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
3/6కానీ అతి ఎక్కువగా నీరు తాగడం కూడా ప్రమాదకరం. శరీరానికి అవసరమైన మోతాదుకి మించి నీరు తాగితే, శరీరంలోని సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీని వల్ల తలనొప్పి, అలసట.. వాంతులు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి బరువు పెరిగినట్లు కూడా అనిపించవచ్చు.. ఎందుకంటే అధిక నీరు శరీరంలో నిల్వవుతుంది.
4/6నిపుణులు చెబుతున్నదేమిటంటే.. నీటిని తాగడం బరువు తగ్గడానికి సహాయపడుతుంది కానీ అది ఒకటే కారణం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర కూడా అవసరం. రోజు మొత్తంలో నీటిని చిన్నచిన్న సిప్స్‌గా తాగడం ఉత్తమం.
5/6ఉదయాన్నే లేవగానే ఒక గ్లాస్ నీరు తాగాలి. భోజనం ముందు 20 నిమిషాలకి నీరు తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది. వ్యాయామం తర్వాత నీరు తాగడం అవసరం. రాత్రి నిద్రకు ముందు ఎక్కువగా తాగకూడదు.
6/6మొత్తానికి.. రోజుకి 8-10 గ్లాసుల నీరు తాగడం శరీరానికి ఆరోగ్యకరం. ఎక్కువ తాగితే బరువు తగ్గకపోవడమే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి నీటిని సమతుల్యంగా తాగండి, శరీరానికి అవసరమైనంత మాత్రమే ఇవ్వండి.