Ducati Diavel V4 Price: భారత బైక్ రేసర్స్‌కి ఊహించని గుడ్‌న్యూస్.. మార్కెట్‌లోకి డుకాటీ కంపెనీ అద్భుతమైన మోటర్‌సైకిల్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Ducati Diavel V4 Price: ప్రముఖ ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ కంపెనీ డుకాటీ భారతీయలకు గుడ్‌న్యూస్ తెలిపింది. తమ కొత్త స్పోర్ట్స్ మోటర్‌సైకిల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. అతి త్వరలోనే మార్కెట్‌లోకి మోటోక్రాస్ బైక్‌లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనిని కంపెనీ అధికారికంగా బుధవారం వెల్లడించింది. ఈ కంపెనీ ఆఫ్-రోడ్ రైడింగ్ మోటోక్రాస్ బైక్‌లు అతి త్వరలోనే భారతీయులకు కూడా లభించనున్నాయి.
డుకాటీ కంపెనీ భారత మార్కెట్‌లో తమ కొత్త మోడల్ బైక్‌లతో పాటు ప్రీమియం ఎడిషన్స్‌ను మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ మోటర్‌సైకిల్స్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే వివిధ రకాల భారత మోటర్‌సైకిల్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
డుకాటీ మోటోక్రాస్ కంపెనీ భారత మార్కెట్‌లో మొదట స్క్రాంబ్లర్, మల్టీస్ట్రాడా మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. దీంతో పాటు మరెన్నో కొత్త ఎడిషన్ మోటర్‌సైకిల్స్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ..2026 సంవత్సరంలో డుకాటి కంపెనీకి సంబంధించిన అన్ని రకాల మోటర్ సైకిల్స్ లభిస్తాయని, రోడ్లపై అన్ని రకాల మోటర్ సైకిల్స్‌ను చూస్తామని తెలిపారు.
డుకాటి కంపెనీ ఇటీవలే జరిగిన ప్రత్యేకమైన ఈవెంట్‌లో భాగంగా భారతదేశంలో పానిగేల్ V4 మోడల్ మోటర్‌సైకిల్స్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్‌లో భాగంగా V4తో పాటు V4 S మోడల్ మోటర్ సైకిల్స్ అందుబాటులోకి రానున్నాయి.
ఇక ఈ మోటర్‌సైకిల్స్ ధరల వివరాల్లోకి వెళితే.. ధర రూ.29.99 లక్షలు నుంచి ప్రారంభమైన రూ.35.6 లక్షల్లో కూడా లభించనున్నాయి. గత ఏడాదిలో కంపెనీ అమ్మకాల్లో 6 నుంచి 7 శాతం వృద్ధి రేటు సాధించిందన్నారు.