Powerful Jupiter Transit Effect On Zodiac: అక్టోబర్ 19 చోటా దీపావళి ముందు రోజే బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా మకర రాశితో పాటు మరికొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోబోతున్నాయి.
Powerful Jupiter Transit Effect On Zodiac Telugu: అక్టోబర్ నెలలో ఎంతో శక్తివంతమైన బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. ఈ గ్రహాన్ని జ్ఞానంతో పాటు అదృష్టం ఆనందానికి సూచికగా భావిస్తారు. అక్టోబర్ 19న బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. చోటా దీపావళిగా పిలిచే ముందు రోజే ఈ సంచారం జరగబోతోంది.. దీని కారణంగా 12 రాశుల వారిపై ఘననీయమైన ప్రభావం పడుతుందట..
1/5చోటా దీపావళి సమయంలో బృహస్పతి గ్రహం సంచారం చేయడం కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడడమే కాకుండా మిథున రాశి తో పాటు కన్యారాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎన్నో రకాల ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
2/5బృహస్పతి సంచారం కారణంగా మిధున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా బోలెడు లాభాలు కలుగుతాయి డబ్బు పరంగా కొన్ని సమస్యలు తీరిపోయి.. సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు ఈ సమయంలో కొన్ని యాత్రలకు కూడా వెళ్తారు. మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి.
3/5కన్య రాశి వారికి గృహస్పతి సంచారం కారణంగా ఈ సమయం చాలా శుభాలను అందిస్తుంది. ముఖ్యంగా సంపాదన విపరీతంగా పెరిగి ఆస్తులు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు కూడా తిరిగి పొందుతారు. వీరు కొత్త ఇళ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేస్తారు. కెరీర్ పరంగా కూడా చాలా వరకు పురోగతి లభిస్తుంది.
4/5వృశ్చిక రాశి వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.. అలాగే వీరు భారీ మొత్తంలో సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. వదులుకున్న ఆశల నుంచి కూడా వీరు బోలెడు ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు వినగలుగుతారు.
5/5మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు భారీ మొత్తంలో డబ్బులు లభిస్తాయి. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ సమయంలో నిరుద్యోగులు కూడా డబ్బులు పొందుతారు. కొత్త మూలాల నుంచి వీరు డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా పనులు చేయడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు.