Jupiter Transit Effect On Zodiac: డిసెంబర్ 5వ బృహస్పతి గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి రాబోతోంది..
Jupiter Transit Most Powerful Effect On Zodiac: శక్తివంతమైన గ్రహంగా పరిగణించే బృహస్పతి ప్రతి సంవత్సరం రాశిని మారుస్తాడు. అయితే, ఈ ఏడాది కూడా రాశి సంచారం చేశాడు. మే 14న మిథున రాశిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సంచారం జరిగినప్పటి నుంచి తిరోగమన స్థితిలోనే ఉన్నాడు. అయితే, అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం అతి త్వరలోనే రాశి సంచారం చేయబోతోంది.
1/7బృహస్పతి గ్రహం డిసెంబర్ 5వ తేదిన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహం 2026 సంవత్సరం జూన్ 2వ తేది వరకు అక్కడే సంచార దశలో కొనసాగుతాడు. ఆ తర్వాత కర్కాటక రాశివారికి తిరిగి వెళ్తాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఘననీయమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. డబ్బు పరంగా కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. డిసెంబర్ 5వ తేది నుంచి ఏయే రాశులవారికి చాలా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
2/7బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వివిధ రకాల వనరుల నుంచి డబ్బులు కూడా లభిస్తాయి. ఆర్థికంగా అద్భుతంగా లాభాలు కలుగుతాయి. సామాజిక స్థితి కూడా మెరుగుపడుతుంది.
3/7మిథున రాశిలో జన్మించిన వారికి కూడా బృహస్పతి సంచారంతో గణనీయమైన లాభాలు కలుగుతాయి. వీరికి ప్రతి అడుగులోనూ అదృష్టం సహకరించబోతోంది. ఉద్యోగాల పరంగా మంచి పురోగతి లభించబోతోంది. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా సంపదనతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
4/7సింహ రాశివారికి గురుగ్రహం ప్రభావంతో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి సంపదన కూడా అద్భుతంగా పెరుగుతుంది. ఆస్తుల పరంగా కూడా కలిసి వస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి మంచి లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రభుత్వ పరిపాలనల్లో పనులు చేస్తున్నవారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయి.
5/7వృశ్చిక రాశివారి జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి..ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటాయి. వీరికి ఈ సమయంలో భారీ మొత్తంలో ఆదాయం పెరుగుతుంది. పొదువు చేయడంతో కూడా మంచి విజయాలు సాధిస్తారు. కెరీర్ పరంగా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
6/7బృహస్పతి సంచారంతో ధనుస్సు రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరు తప్పకుండా ఈ సమయంలో శత్రువులపై అఖంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అనేక సమస్యలు కూడా తొలగిపోతాయి.
7/7(NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.)