Panchagrahi and Saptagrahi Yoga Effect: చాలా అరుదుగా కొన్ని గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తాయి కొన్ని గ్రహాలు మాత్రమే ప్రతినెల రాశి సంచారాలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రహాలు కొన్ని రాశుల్లో రెండు నుంచి మూడు కలిసినప్పుడు. ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే అతి త్వరలోనే పంచగ్రహి, సప్త గ్రహీయోగాలు ఏర్పడతాయి. దాదాపు వందేళ్ల తర్వాత ఈ యోగాలు ఏర్పడనన్నాయి. మార్చి 29న శని గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల సప్తగ్రహ యోగం ఏర్పడబోతోంది.
ఇక శుక్రుడు, బుధుడు, సూర్యుడుతో పాటు చంద్రుడు, శని, కుజుడు అన్ని కలిపి ఒకే రాశులు సంచారం చేయడం వల్ల మరో అద్భుతమైన శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాల పొందుతారు. ముఖ్యంగా ఆకస్మిక ఆర్థిక లాభాలతో పాటు వ్యక్తిగత జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది.
శని సంచారంతో పాటు సప్తగ్రహి యోగం ఏర్పడడం వల్ల మిధున రాశి వారు ఎక్కువగా లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు ఎక్కువగా ఈ సమయంలో పనులు చేయడం ఎంతో మంచిది దీని వల్ల సులభంగా విజయాలు సాధించగలుగుతారు అలాగే ఈ సమయంలో మీకు కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కలుగుతుంది. వ్యాపారాల్లో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి.
ఇక నిరుద్యోగ యువతకు ఈ సమయంలో అద్భుతమైన కంపెనీల నుంచి జాబ్స్ ఆఫర్స్ లభిస్తాయి. కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు ఎలాంటివైనా మిథున రాశి వారికి ఈ సమయంలో తొలగిపోతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయం చాలా వరకు కలిసి వస్తుంది. దీని కారణంగా భారీ లాభాలు పొందగలుగుతారు. ఇక కష్టపడి పని చేయడం వల్ల గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
కన్యా రాశి వారికి కూడా సప్తగ్రహి రాజయోగం ఏర్పడడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ధైర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది దీనివల్ల జీవితంలో ఎప్పుడు పొందలేని తన లాభాలు పొందగలుగుతారు. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉండబోతోంది.
కన్య రాశి వారికి జీవిత భాగస్వామి సపోర్టు లభించే వ్యాపారాల్లో మంచి ఆర్థిక లాభాలు పొందుతారు. అవివాహితులకు ఈ యోగాల ఎఫెక్ట్‌తో మంచి భాగస్వామితో వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో వీరికి ఊహించని స్థాయిలో ప్రజాదరణ కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో గౌరవం కూడా లభిస్తుంది.
కర్కాటక రాశి వారికి కూడా ఈ శక్తివంతమైన యోగాల వల్ల బంఫర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సప్తగ్రహి యోగం ఎఫెక్ట్ వల్ల అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కొత్త భాగస్వాములు కూడా లభిస్తారు.
కర్కాటక రాశివారు ప్రతి పనిలో విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా వీరికి పదోన్నతులు కూడా కలుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్లాలనుకునేవారి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలు కూడా పొందగలుగుతారు.