Add Zee Business As A Preferred Source
App

Hamsa Mahapurusha Yoga: 100 ఏళ్ల తర్వాత దీపావళి రోజు హంస మహాపురుష రాజయోగం.. ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్..

Published: Oct 15, 2025, 09:46 AM IST|Updated: Oct 15, 2025, 09:46 AM IST

Hamsa Mahapurusha Yoga Powerful Effect: వందేళ్ల తర్వాత దీపావళి రోజున ఎంతో శక్తివంతమైన హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపబోతోంది. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశలేవో తెలుసుకోండి.

Hamsa Mahapurusha Yoga Powerful Effect: భారతదేశంలో ఇప్పటికే దీపావళి పండగ సీజన్ ప్రారంభమైంది. కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో హిందువులంతా దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ ఆనందంతో పాటు శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈరోజు లక్ష్మీదేవితో పాటు విగ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధన లాభాలు కలుగుతాయని నమ్మకం. అయితే, ఈ ఏడాది అక్టోబర్ 20 సోమవారం రోజున దీపావళి పండగ వచ్చింది. 
 

Hamsa Mahapurusha Yoga1/6

బృహస్పతి

దీపావళి పండగకు ముందే అనేక గ్రహాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా 100 సంవత్సరాల తర్వాత ఒక యాదృచ్ఛికం ఏర్పడబోతోంది. అక్టోబర్ 18వ తేదీన దేవగురువు బృహస్పతి సొంత రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది.   

Hamsa Yoga2/6

హంస మహా పురుష రాజయోగం

ముఖ్యంగా శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీర్తి, ప్రతిష్టలను తీసుకువస్తుంది. ఈ రాజయోగం అపారమైన ధన లాభాలను కూడా అందిస్తుంది. అలాగే జీవితంలో ఆనందాన్ని పెంచి స్నేహితులను కూడా ఊహించని స్థాయిలో పెంచగలుగుతుంది. ఓకేనా దీపావళి రోజున ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడడం వల్ల ఈ క్రింది రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.  

Hamsa Mahapurush Effect3/6

కర్కాటక రాశి 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం కర్కాటక రాశి అధిపతిగా వ్యవహరిస్తుంది. అయితే ఇదే రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగానే హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాజయోగం వల్ల కర్కాటక రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులు మొత్తం పూర్తి అవుతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు లభించి కొన్ని రకాల పనులు వెంటనే చేయగలుగుతారు. మానసిక ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గుతుంది.  

Hamsa Yoga Benefits Effect4/6

తులారాశి 

తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ మహాపురుష రాజయోగం అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా ఎన్నో పదోన్నతులను తీసుకువస్తుంది. అలాగే వీరికి ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.  

Hamsa Yogam Effect5/6

వృశ్చిక రాశి 

వృశ్చిక రాశి వారికి పోషించిన శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా దీనికి కరిగిపరంగా ఊహించని ఆర్థిక లాభాలు పండగలుగుతారు. అలాగే వీరు కొత్త ఆస్తులను కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. వీరికి ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.

Hamsa Yoga In Kundli Effect6/6

నోట్

నోట్: ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపిన అంచనాలు మాత్రమే.. ఈ సమాచారం మీ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. అలాగే దీనిని జీ న్యూస్ దృవీకరించదు..