Shani Dev Powerful Effect On Zodiac: శని అక్టోబర్ మూడో తేదీన నక్షత్ర సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవించి.. ఊహించని ప్రయోజనాలకు అందబోతున్నారు.
1/5దేవ గురువు బృహస్పతి ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారిపై దేవగురువు గృహస్పతితో పాటు శని ప్రభావం కూడా పడుతుంది. దీనివల్ల వివాహంలో వస్తున్న అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని రాశుల వారికి కెరీర్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
2/5ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కెరీర్‌లో నిలిచిపోయిన ప్రణాళికలు కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి సీనియర్ల నుంచి మంచి సపోర్టు లభించి బాగా రాణించగలుగుతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు.
3/5కర్కాటక రాశి వారికి శని సంచార ప్రభావంతో అన్ని రకాల కోరికలు నెరవేరబోతున్నాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో కొంత కోలుకునే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేకమైన ఆనందం పొంది.. మానసికంగా చాలా బాగుంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
4/5కుంభ రాశి వారికి వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ఉద్యోగాల్లో బాగా రాణించగలుగుతారు. దీంతోపాటు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరు తప్పకుండా యాత్రలకు వెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు.
5/5మీన రాశి వారికి శని అనుగ్రహంతో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో సంపాదన కూడా పెరిగి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే జీవితంలో వస్తున్న అన్ని రకాల అడ్డంకుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. మానసికంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. కెరీర్ పరంగా అడ్డంకులు కూడా తొలగిపోతాయి.