Add Zee Business As A Preferred Source
App

Maha Hamsa Raja Yoga: దీపావళి సమయంలో శక్తివంతమైన మహాహంస రాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని డబ్బే డబ్బు..

Published: Oct 01, 2025, 10:19 AM IST|Updated: Oct 01, 2025, 10:19 AM IST

Maha Hamsa Raja Yoga Effect On Zodiac: ఎంతో శక్తివంతమైన మహాహంస రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. 

Maha Hamsa Raja Yoga Effect On Zodiac Telugu: ఈ ఏడాది దీపావళికి ముందే ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో శని, బృహస్పతి కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో అరుదైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శని ఈ సమయంలో మీన రాశిలో.. బృహస్పతి కర్కాటక రాశిలో ఉండడం వల్ల మహాహంస రాజయోగం ఏర్పడబోతోంది. 
 

Maha Hamsa Raja Yoga Effect1/5

మహాహంస రాజయోగం

మహాహంస రాజయోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మీన రాశితో పాటు కర్కాటక రాశి మరికొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ సమయంలో అదృష్టం కూడా కలిసి రాబోతోంది. ముఖ్యంగా శని మీనరాశిలో తిరోగమన దశలో ఉన్నాడు. అయితే ఈ సమయంలో శని ప్రభావం కూడా కొన్ని రాశుల వారిపై పడుతుంది..

Maha Hamsa Raja Yoga 2/5

మీన రాశి 

మహాహంస రాజయోగం ప్రభావం వల్ల మీన రాశి వారికి ఈ సమయంలో కొత్త అధ్యాయనం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా చాలా కాలంగా ఎదురుచూసిన నిరీక్షణ ఈ సమయంతో ముగుస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో వీరు అద్భుతమైన అవకాశాలతో ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగాలైన వ్యాపారాల్లోనైన ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.   

Hamsa Yoga Married Life3/5

కర్కాటక రాశి 

బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఆనందం లభించడమే.. కాకుండా పురోగతి మానసిక ప్రశాంతతను లభిస్తాయి.. కొత్త ఉద్యోగాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అలాగే ఆర్థికంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి.   

Hamsa Panch Mahapurush Yoga Benefits4/5

తులారాశి 

తులా రాశి వారికి 11 వ స్థానంలో ఈ శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.. దీనికి కారణంగా వీరికి కీర్తి, ప్రతిష్టలు లభించడమే కాకుండా జీవితంలో పదోన్నతులు కూడా లభించి ఊహించని బాధ్యతలను పొందగలుగుతారు. అలాగే నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో తిరిగి ప్రారంభమవుతాయి.   

Hamsa Panch Mahapurush Yoga 5/5

తులారాశి 

తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కొత్త బాధ్యతలు ఈ సమయంలో లభించబోతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం చాలా లాభదాయకంగా మారబోతోంది. అలాగే కార్యాలయాల్లో గౌరవం కూడా పెరిగి ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి.