Shani dev Effect: శని కుబేర యోగంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. వీరి జీవితాల్లో అష్టైశ్వార్యాలే..

Shani dev Effect: శని దేవుడు న్యాయానికి ప్రతీక. అంతేకాదు ధర్మ బద్ధంగా..  న్యాయ బద్దంగా వ్యవహరించే వారి పట్ల కరుణా, కటాక్షాలను చూపిస్తాడు. అదే అధర్మంగా ప్రవర్తించే వారి విషయంలో దండంతో దండిస్తాడు. రాబోయే ఏప్రిల్ 6న మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

  • Mar 17, 2025, 11:29 AM IST
1 /5

Shani dev Effect: శని దేవుడు రాశి మార్పు వలన కొన్ని రాశుల వారి దశ, దిశ మారనుంది. శని, కుబేర అనుగ్రహంతో ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించబోతున్నాడు. అంతేకాదు ఈ రాశుల వారికీ  కుబేరుడి సంపద దక్కబోతుందని సమాచారం.

2 /5

కన్య రాశి: ఈ రాశి వారికి శనీశ్వరుడు అనుగ్రహం వలన అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశుల వారికీ కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో కీర్తి, గౌరవం దక్కుతాయి. సొంతంగా వ్యాపారం నడిపే వారు వ్యాపార విస్తరణ  చేపడతారు. మీలో  ఆత్మవిశ్వాసం రెండింతలు పెరుగుతుంది మరియు చేసే పనిలో విజయం సాధిస్తారు.

3 /5

కర్కాటక రాశి: ఈ రాశి వారికి శనిదేవుడు ఉదయించడం వలన ఈ రాశి వారికి  పనిలో అపారమైన విజయం లభిస్తుంది. వ్యాపారంలో భారీ లాభాలను అందుకుంటారు.  జీవిత భాగస్వామితో సంబంధం గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. వృద్ధుల ఆస్తి లావాదేవీలకు సంబంధించిన కోర్టు కేసులు వీగిపోతాయి.  

4 /5

ధనుస్సు రాశి: శని దేవుడు రాశి మార్పు వలన ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.  కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం పుష్కలంగా ఉంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిని కూడా అప్పగిస్తారు. మీ అనేక సంవత్సరాల కృషి ఖచ్చితంగా ఫలిస్తుంది మీరు రాజ భోగాలను అనుభవిస్తారు.

5 /5

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, పండితులు, పంచాంగంలో ప్రస్తావించిన అంశాల ఆధారంగాఈ సమాచారం ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించలేదు.