Add Zee Business As A Preferred Source
App

Shani Dev: ఈ రాశుల వారిపై శని ఎల్లప్పుడూ వరాల జల్లు.. ఎప్పటికైనా కుబేరులు అవ్వాల్సిందే..

Published: Sep 06, 2025, 10:59 AM IST|Updated: Sep 06, 2025, 10:59 AM IST

Shani Dev Effects Zodiac: శని గ్రహాన్ని అత్యంత శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రహం కొన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ శుభ ఫలితాలు అందిస్తూనే ఉంటుంది. అయితే శని గ్రహం ఎఫెక్ట్‌తో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Shani Dev Effects Zodiac: 9 గ్రహాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహం శని. ఈ గ్రహాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ గ్రహంగా పరిగణిస్తారు. శని దేవుడు వ్యక్తుల కర్మలను అనుగుణంగా ఫలితాలు అందిస్తాడు. జీవితంలో నువ్వు అందరికీ మంచి చేస్తేనే.. నీకు మంచి జరుగుతుంది. అలాగే చెడు చేస్తే చెడే జరుగుతుంది.. వ్యక్తుల కర్మలను బట్టి మంచి చెడులు శని అందిస్తూ ఉంటాడు. 
 

Shani Dev1/5

శని గ్రహం

శని గ్రహం అత్యంత శక్తివంతమైనదిగా చెప్పుకుంటారు. ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి.. దేనికి లోటు ఉండదు. అంతేకాకుండా ఎప్పుడు నెరవేరని కోరికలు కూడా నెరవేరుతాయి. శని గ్రహం కొన్ని రాశుల వారికి జాతకంలో ప్రతికూల స్థానంలో ఉన్నప్పటికీ.. ఎల్లప్పుడు శుభ ఫలితాలను అందిస్తూనే ఉంటాడు. ఎందుకంటే శనికి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. ఆయా రాశుల వారికి ఎల్లప్పుడూ ఊహించని లాభాలు అందిస్తూనే ఉంటాడు..  

Shani Dev Effect2/5

శనికి అత్యంత ఇష్టమైన రాశులు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి మూడు రాశులు అంటే చాలా ఇష్టం.. ఈ రాశుల వారు శని దేవుడి ప్రత్యేకమైన ఆశీస్సులు ఎల్లప్పుడూ పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి చక్రాల్లో జన్మించిన వ్యక్తులు జీవితంలో ఆనందంతో పాటు ఊహించని సంపద పొందగలుగుతారు. అంతేకాకుండా శని ఎల్లప్పుడూ వారికి సానుకూలమైన ఫలితాలు అందిస్తూనే ఉంటాడు. 

Shani Saade Sati Effects3/5

మకర రాశి 

మకర రాశి వారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటుంది. వీరికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు..  కాబట్టి ఆయన ఆశీర్వాదంతో వీరు ప్రతిరంగంలో ఊహించని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిచోట వీరు కీర్తిని సంపాదిస్తారు. అంతేకాకుండా సుఖ సంతోషాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.   

Shani Retrograde 2025 Effects4/5

తులారాశి 

శని దేవుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో తులా రాశి ఒకటి. వీరికి శని దేవుడి అనుగ్రహం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ప్రతీ పనిలో ఊహించిన విజయాలు సాధించగలుగుతారు. అలాగే సమాజంలో కీర్తి కూడా సంపాదిస్తారు. కృషికి తగ్గ ప్రతిఫలం లభించి అపారమైన ధన లాభాలు పొందుతారు. మతపరమైన పనులపై ఆసక్తి కూడా లభిస్తుంది.   

Shani Retrograde 20255/5

కుంభరాశి 

కుంభ రాశి వారికి శని దేవుడి ప్రత్యేకమైన ఆశీస్సులు లభిస్తాయి. దీనివల్ల వీరు కష్టపడి పనిచేసి అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి చేసి భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. దీంతోపాటు కుంభ రాశి వారికి తెలివితేటలు, పట్టుదల, జ్ఞానం కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే శ్రేయస్సు లభించి విశేషమైన ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెప్తున్నారు.