Venus Transit 2025 Effect Zodiac: శుక్రుడి సంచారం వల్ల మార్చి 19వ తేదీన కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి ఒడిదుడుకులు వస్తాయి. భాగస్వామ్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు కూడా తలెత్తవచ్చు.
Venus Transit 2025 Effect Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని కీర్తి, ఐశ్వర్యం, వివాహం, సంపద, ప్రేమ, అనురాగాలకు కారకుడిగా భావిస్తారు. అందుకే ఈ గ్రహాన్ని ఇతర గ్రహాల కంటే మంచి గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు సంచారం, నక్షత్ర ప్రవేశం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే శుక్ర గ్రహం మార్చి 19వ తేదీన మీనరాశిలోకి ప్రవేశించబోతోంది. అయితే మీనరాశిలో మార్చి 15న సూర్యుడు కూడా ప్రవేశించబోతున్నాడు. కాబట్టి ఈ రెండు గ్రహాలు కలయిక జరుగుతుంది.
శుక్రుడు మార్చి 19వ తేదీ సాయంత్రం 7 గంటలకు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారిపై అద్భుతమైన ప్రభావం పడుతుంది. దీనివల్ల వారు ఊహించని లాభాలతో పాటు ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.
కానీ ఈ సమయంలో శుక్రుడు మీన రాశిలో ఉన్న సూర్యుడుతో సంయోగం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లాభాలతో పాటు నష్టాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సింహరాశి తో పాటు కొన్ని రాశుల వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి కాస్త జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. వీరికి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. డబ్బు పరంగా వీరికోని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రేమ సంబంధిత విషయాల్లో కూడా కొన్ని సమస్యలు రావచ్చు. అలాగే కుటుంబంలో అభిప్రాయ విభేదాలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశి వారికి శుక్రుడు మీన రాశిలో ప్రవేశించి సూర్యుడుతో కలయిక జరపడం వల్ల ఆశుభ ప్రభావం పడుతుంది. వీరిలో అహంకారం పెరిగి చిన్న చిన్న సమస్యలు తలెత్తయ అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ జీవితంలో పెద్ద పెద్ద సంఘర్షణలు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మేలు.
కర్కాటక రాశి వారికి కూడా శుక్రుడు సంచారం కాస్త ఆశుభంగా ఉంటుంది. వీరికి అనుకున్న కోరికలు నెరవేరడంలో జాప్యం జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన ఒడిదుడుకులు కూడా రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో కష్టపడి పని చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. భాగస్వామ్య జీవితంలో కొన్ని కొన్ని వివాదాలు కూడా తలెత్తవచ్చు.