Moon-Venus Conjunction Effect: మార్చి 17వ తేదీన తులారాశిలోకి చంద్రుడు ప్రవేశించబోతున్నాడు ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారు విశేషమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Moon-Venus Conjunction Effect On Zodiac: ఈ సంవత్సరం హోలీ పండగ మార్చి 14వ తేదీన వచ్చింది. ఈ పండక్కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు ఇది ఒకటి అలాగే జ్యోతిష్య శాస్త్రం పరంగా కూడా హోలీ పండగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతోందని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. హోలీ తర్వాత చంద్ర గ్రహం సంచారం చేయబోతోంది.
మార్చి 17వ తేదీన చంద్రుడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే తులా రాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఈ రెండు గ్రహాలు కలయిక జరగబోతోంది. ఎంతో శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగా ఏర్పడబోయే శక్తివంతమైన ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు తీసుకురాబోతోంది.
తులా రాశిలో శుక్రుడు, చంద్రుడి కలయిక జరగడం వల్ల కర్కాటక రాశి వారికి జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. అద్భుతమైన సుఖ సమయం ప్రారంభమవుతుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రశంసలు కూడా లభిస్తాయి.
ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ సమయోగం ఏర్పడడం వల్ల కుటుంబం ఉద్యోగం పరంగా కూడా కాస్త బాధ్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో తల్లిదండ్రుల సపోర్టు లభించి.. ఆర్థికంగా లాభాలు పొందగలుగుతారు. మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరికి కాస్త విముక్తి లభించి బోలెడు లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వారికి కూడా పదోన్నతులు లభిస్తాయి.
మిథున రాశి వారికి కూడా శుక్రుడు, చంద్రుడి కలయిక కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అనేక శుభసంకేతాలు అందుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. అలాగే ఆనందం కూడా రెట్టింపు పై మానసిక సమస్యలు తొలగిపోతాయి.
మిధున రాశి వారికి కూడా ఆర్థికపరమైన కోరికలు నెరవేరుతాయి. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కష్టాల్లో ఉన్నవారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. వీరికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో పాటు ఇతరుల సపోర్టు లభించి వ్యాపారాల పరంగా పురోగతి సాధిస్తారు. అలాగే వ్యాపారాల్లో లాభాలు కూడా భారీ స్థాయిలో పొందుతారు.
ఈ సమయంలో తులా రాశి వారికి కూడా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అలాగే ఇతరులకు ఇచ్చిన అప్పు కూడా తిరిగి వస్తుంది. ఆర్థికపరంగా ఎప్పటినుంచో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. భూమి, ఆస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.