Kanaka durga Navratri dussehra celebrations: కనక దుర్గమ్మ నవరాత్రి పండగ వేళ ఇప్పటికే అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో భక్తులకు వీఐపీ దర్శనాలపై కీలక అలర్ట్ జారీ చేశారు.
1/6
విజయవాడ దసరా నవరాత్రులు:
దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన కూడా అమ్మవారి శరన్నావరాత్రి ఉత్సవాలకు అమ్మవారి ఆలయాలన్ని ముస్తాబవుతున్నాయి. అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు, తొమ్మిది రూపాల్లో భక్తులు కొలుచుకుంటారు. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాత అమ్మవారి ఆలయంగా, భక్తుల కొంగు బంగారంగా కూడా విజయవాడ కనక దుర్గమ్మను భక్తులుకొలుచుకుంటారు.
2/6
దసరా నవరాత్రులు:
ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా.. దసరా ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంను అందంగా ముస్తాబు చేశారు. అమ్మవారి ఆలయంకు దర్శనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కల్గకుండా బారికెడ్లను ఏర్పాటు చేశారు. నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈసారి 500 రూపాయల టికెట్‌ను రద్దు చేశారు.
3/6
దేవీ శరన్నావరాత్రులు:
అదే విధంగా.. వీఐపీ దర్శనాలకు సంబంధించి కూడా అనేక మార్పులు చేశారు. పార్కింగ్ లు, పారిశుద్దం మొదలైన వాటిలో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శరన్నావరాత్రుల్లో ఒక రోజు పూర్తిగా వీఐపీ దర్శనాలను రద్దు చేస్తు విజయవాడ ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
4/6
నవరాత్రి ఉత్సవాలు:
దుర్గ గుడి ఈవో శీనానాయక్ భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులకు కీలక అలర్ట్ జారీ చేశారు. దుర్గమ్మ ఉత్సవాల సందర్భంగా .. ఈ సారి నగరంలో విజయవాడ ఉత్సవంకు 20 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
5/6
కనక దర్గ టెంపుల్:
ఈ ఏడాది కేవలం రూ. 300, 100 రూపాయలు, ఫ్రీ దర్శనం క్యూలైన్లు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. అలానే రద్దీ ఎక్కువగా లేని సమయం అంటే ఉదయం 7-9 గంటల మధ్య, సాయంత్రం 3-5 గంటల మధ్య మాత్రమే వీఐపీ దర్శనాలను అనుమతిస్తామన్నారు.పెద్ద వయసు వారికి, దివ్యాంగులు దర్శనం చేసుకునేందుకు సాయంత్రం 4-5 గంటల వరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు.
6/6
విజయవాడ:
అలానే మూలా నక్షత్రం రోజున అనగా సెప్టెంబర్ 29వ తేదీన చంద్రబాబు నాయుడు దంపతులు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆ రోజున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కువగా వస్తారు. అందుకే సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండకూడదని, ఆరోజు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా.. ఈ సంవత్సరం ఎక్స్‌ట్రాగా మరో 8 లడ్డూ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్నిరకాల ఏర్పాట్లు తీసుకున్నామన్నారు.