Telangana Dussehra School Holidays 2025: విద్యార్థులకు పండగ లాంటి వార్త తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు స్కూళ్లకు సంబంధించి ప్రకటించేసింది. దానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు పండగ లాంటి వార్తా అని చెప్పొచ్చు. అయితే ఏకంగా దసరాకు ఈసారి ఎన్ని రోజులు సెలవులు వస్తాయో ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5తెలంగాణలోని విద్యార్థులకు బంపర్ ఆఫర్. దసరాకు సంబంధించి ప్రభుత్వం సెలవుల జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో ఈనెల 21 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మొత్తానికి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు సెలవులు రానున్నాయి
2/5అటు జూనియర్ కాలేజీలకి ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు కూడా ప్రకటించేసింది. ఈ వార్త విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త అవుతుంది. ఇది మొత్తం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు వర్తిస్తాయి .
3/5అంటే తెలంగాణలోని అన్ని స్కూళ్లకు దాదాపు 13 రోజులు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 4 నుంచి తిరిగి క్లాసులు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ సెలవుల షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ తెలిపింది.
4/5మొన్నటి వరకు వరుసగా మూడు రోజులు స్కూళ్లకు సెలవు రావడంతో విద్యార్థులు ఎగరి గంతేస్తారు. సెప్టెంబర్ 5వ తేదీన ఈద్ ఏ మిలాద్, 6వ తేదీన గణేష్ నిమజ్జనం, ఇక మరుసటి రోజు 7వ తేది ఆదివారం రావడంతో వరుసగా మూడు రోజులు స్కూలుకు సెలవులు వచ్చాయి.
5/5ఇదే నెలలో మరోసారి స్కూళ్లకు సెలవులు రావడంతో విద్యార్థులు ఎగిరికి గంతేసే వార్త అవుతుంది. దాదాపు 13 రోజులు విద్యార్థులకు దసరా సెలవులు రానున్నాయి. ఆ తర్వాత దీపావళి సెలవులు కూడా ఒక మూడు రోజులు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు పండగలాంటి వార్త.