Add Zee Business As A Preferred Source
App

School Holidays: విద్యార్థులకు బంపర్‌ బొనాంజ.. అక్టోబర్‌ మొదటి వారం పూర్తిగా దసరా సెలవుల ప్రకటన..!

Written ByRenuka Godugu
Published: Sep 30, 2025, 05:27 PM IST|Updated: Sep 30, 2025, 05:27 PM IST

Dussehra School Holidays: దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లతో పాటు కాలేజీలో అన్నీ విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చేశారు. అయితే కొన్ని స్కూళ్లకు మాత్రం అక్టోబర్ 6వ తేదీ సోమవారం రీఓపెన్ కాగా.. మరికొన్ని స్కూళ్లు మాత్రం అక్టోబర్ 3వ తేదీనే పునః ప్రారంభం కానున్నాయి. అయితే అక్టోబర్ మొదటివారం మొత్తం కూడా దసరా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అది ఎక్కడెక్కడ తెలుసుకుందాం
 

School Holidays 20251/5

స్కూళ్లకు సెలవు 2025

 విద్యార్థులకు స్కూళ్లకు సెలవు అంటే పండగ చేసుకునే వాతావరణం కలుగుతుంది. ఎందుకంటే కాస్త బిజీ వర్క్ నుంచి బయటపడతారు. హోంవర్క్ ,ప్రాజెక్టు వర్క్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రులు సెలవులు కొనసాగుతున్నాయి.  

October School Holidays2/5

అక్టోబర్ స్కూళ్లకు సెలవులు

 అయితే, స్కూళ్లకు అక్టోబర్ 3వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. కొన్ని 4వ తేదీన రీ ఓపెన్ కానున్నాయి. కానీ కొన్ని స్కూళ్లు మాత్రం అక్టోబర్ 6వ తేదీన తిరిగి ప్రారంభమవుతాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌, దుర్గ పూజ వైభవంగా నిర్వహిస్తారు. కాబట్టి 6వ తేదీన రీఓపెన్‌ అవుతాయి. దీంతోపాటు అస్సాం, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝార్ఖండ్, ఒడిశా వంటి ప్రాంతాల్లో కూడా సెలవులు  

October First Week3/5

అక్టోబర్ మొదటివారం

 ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ మొదటివారం పూర్తిగా సెలవులు మంజూరు చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే తెలంగాణలో కూడా కొన్ని స్కూళ్లకు అక్టోబర్ 6వ తేదీ సోమవారం రీఓపెన్ జరగనున్నాయి. మరికొన్ని స్కూళ్లు మాత్రం 3వ తేదీన రిఓపెన్ అవుతున్నాయి  

School Reopen4/5

స్కూళ్లు రీఓపెన్‌

 అయితే ముంబై, రాయగఢ్‌, పూనే వంటి ప్రాంతాలలో ఐఎండి హెచ్చరికల ప్రకారం స్కూళ్లకు హాలిడేస్ ప్రకటిస్తారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. దూరప్రాంతాలకు ప్రయాణాలు చేయకూడదని చెప్పారు. ఐఎండీ హెచ్చరికల ప్రకారం స్కూళ్లు రీఓపెన్‌ చేయనున్నారు.  

October5/5

అక్టోబర్‌

అక్టోబర్‌ నెలలో దసరా, దీపావళి సందర్భంగా ఈ నెలలో స్కూళ్లకు సెలవులు భారీగా వస్తున్నాయి. దీపావళి పండుగకు లక్ష్మిదేవి పూజ చేస్తారు. ఆ సమయంలో కూడా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు ఉండవచ్చు. బ్యాంకులు కూడా ఈ నెలలో దేశవ్యాప్తంగా 18 రోజులు సెలవులు రానున్నాయి.