Dussehra Holidays 2025: తెలంగాణలో అన్నీ స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అయితే ఈ సెలవుల్లో ప్రైవేటు స్కూలు, కాలేజీలలో ఎలాంటి తరగతులు కూడా నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం
1/5తెలంగాణలోని ప్రైవేట్ స్కూలు, కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దసరా సెలవులు స్కూల్, కాలేజీలు ఎలాంటి ప్రైవేట్ తరగతులు నిర్వహించకూడదని పాఠశాలలు, కాలేజీ యాజమాన్యానికి హెచ్చరించింది.
2/5సెలవుల్లో రివిజన్ కోసం విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వాలని సూచించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూలు కాలేజీలు మాత్రం ఎందుకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆదేశాలు జారీ చేసింది.
3/5రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ఈనెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే ఇక జూనియర్ కాలేజీలకు ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు రానున్నాయి. మొత్తంగా 13 రోజులపాటు స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి.
4/5మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రకటించారు. అక్టోబర్ 3వ తేదీకి స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. దసరా వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తారు.
5/5పెద్ద ఎత్తున స్కూళ్లకు కాలేజీలకు సెలవులు వచ్చేది దసరా పండుగ సందర్భంగా.. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా దసరా సెలవులు ప్రకటించారు. అక్కడ దాదాపు 17 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.