School Holidays: స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పుడు? ఎన్ని రోజులు?

AP School Holidays: ఏపీలోని ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 203 రోజులు పని చేయనున్నట్లు  ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 2025 -26 సంవత్సరానికి 83 రోజులు సెలవులు ఉన్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇక దసరా సెలవులు కూడా ఎప్పుడు వస్తున్నాయి ?ఎన్ని రోజులు వస్తున్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
 

1 /6

 ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బంపర్ గుడ్ న్యూస్. దసరా సెలవుల జాబితా కూడా వచ్చేసింది. ప్రభుత్వం మొత్తంగా స్కూళ్లకు 203 రోజులు పని దినాలు, 83 సెలవు దినాలు ప్రకటించింది.   

2 /6

ఈ నేపథ్యంలో స్కూళ్లకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు కూడా ప్రకటించేసింది. అంటే దసరా సెలవులు దాదాపు 10 రోజుల వరకు వస్తున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు ఏపీలో జనవరి 10 నుంచి 18 వరకు రానున్నాయి.   

3 /6

 ఇక ఏపీలోని అన్ని స్కూళ్లకు మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఇలా ప్రతి ఏడాది నిర్వహిస్తారు. మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవులు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబర్ నుంచి 28 వరకు వర్తిస్తాయి.   

4 /6

 ఈరోజు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిసిపోయాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. ప్రైమరీ నుంచి ఉన్నత పాఠశాలల వరకు అన్ని బడులు ప్రారంభమవుతున్నాయి.   

5 /6

 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు కొనసాగుతాయి. అయితే ఇప్పటికే పాఠశాల పుస్తకాలు యూనిఫారమ్‌లు అన్ని కొనుగోలు చేశారు. కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.   

6 /6

 ఇక తెలంగాణలో నేటి నుంచి స్కూలు పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలుకునున్నారు. సర్కారు బడిలో అడ్మిషన్లు పెంచేందుకు ఇలా బడబాట నిర్వహిస్తున్నారు.