Add Zee Business As A Preferred Source
App

Dussehra Shardiya Navratri 2025: దసరా రోజున ఏంచేయాలి..?. ఏంచేయకూడదు..?.. పండితులు ఏంచెబుతున్నారంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 29, 2025, 07:11 PM IST|Updated: Sep 29, 2025, 07:13 PM IST

Dussehra festival: దేవీ శరన్నావరాత్రుల ఉత్సవాల్ని భక్తులు ఎంతో ఉల్లాసంగా, భక్తిభావనలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులను దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండగను మనం అక్టోబర్ 2న జరుపుకోబోతున్నాం.

Durga puja:1/5

నవరాత్రిఉత్సవాలు:

దేవీ శరన్నావరాత్రుల దుర్గపూజల్ని భక్తులు ఎంతో భక్తి భావనలతో నిర్వహించుకుంటున్నారు. అయితే.. చాలా మంది ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు సార్లు అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేయించుకుంటూ, లలితా దేవీ పారాయణం చేస్తు తమ భక్తిని చాటుకుంటున్నారు.  

Shardiya navratri:2/5

నవరాత్రి పూజలు:

అయితే.. దసరా పండగ రోజును మనం ఈసారి అక్టోబర్ 2న జరుపుకోబోతున్నాం. అదే విధంగా ఇదే రోజున చాలా మందిప్రాంతాల్లో రావణ దహనం కూడా నిర్వహిస్తారు.  పంచాంగం ప్ర‌కారం.. అక్టోబర్ 2, 2025న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ప్రదోష కాలం ఉంది.   

Durga puja:3/5

దుర్గాపూజ:

ఈ సమయంలో రావణ దహనం మంచిదని పండితులు చెబుతున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రాముడిని పూజించి, రావణ దహనం చేస్తారు.  అయితే దసరా రోజున తప్పకుండా పాటించాల్సిన, చేయకూడదని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

Dussehra:5/5

దసరా:

అదే విధంగా దసరా రోజున ఎవరితో వాగ్వాదంకు దిగొద్దు. ముఖ్యంగా..ఇతరుల గురించి చెడుగా మాట్లాడు కొవడం, చెడు ఆలోచనలు చేయడం వంటివి మానుకోవాలి. కేవలం దైవనామస్మరణ చేయాలి. ఇనుమును ఇంటికి తెచ్చుకొవద్దు. నల్లనివి ఏవి కూడా ఇంటికి తీసుకొని రావడం వంటివి చేయోద్దు. ఈ విధంగా నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.