Add Zee Business As A Preferred Source
App

Stomach Cancer: పొట్ట కేన్సర్ లక్షణాలు..ఈ సమస్యలు కనిపిస్తే గ్యాస్, కడుపునొప్పి.. అని అస్సలు అనుకోవద్దు..

Written ByVishnupriya
Published: Sep 23, 2025, 07:13 PM IST|Updated: Sep 23, 2025, 07:13 PM IST

Stomach Cancer Symptoms : పొట్టకు కేన్సర్ ప్రారంభ దశల్లో.. సాధారణ కడుపునొప్పి..లేదా గ్యాస్ సమస్యలాగా కనిపించవచ్చు. అందుకే చాలా మంది దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ కొన్ని చిన్న లక్షణాలను గమనించడం ముఖ్యం. వీటిని గుర్తిస్తే.. త్వరగా వైద్య సలహా తీసుకొని సమస్యను ముందుగానే గుర్తించవచ్చు.

Cancer Warning Signs1/5

తేలిక భోజనం చేసినా పొట్ట భారంగా అనిపించడం

సాధారణంగా ఎక్కువ తిన్న తర్వాతనే పొట్ట భారంగా అనిపిస్తుంది. కానీ పొట్ట కేన్సర్ ఉన్నప్పుడు, చిన్న భోజనం చేసినా పొట్ట లో భారంగా..అనిపిస్తుంది. దీని కారణంగా ఆహారం తక్కువగా తింటారు.. బరువు తగ్గడం మొదలవుతుంది.

Stomach Pain2/5

పొట్ట నొప్పి.. వెనకకు వ్యాపించడం..

గ్యాస్ సమస్య.. సాధారణంగా ఛాతీ లేదా పైపొట్టిలో నొప్పి కలిగిస్తుంది. కానీ పొట్ట కేన్సర్ వల్ల నొప్పి వెనుక భాగానికి వెళ్ళవచ్చు.. బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు   

Unexplained Weight Loss3/5

తరచుగా వాంతులు

వాంతులు సాధారణంగా ఏదైనా మనకు పడనది.. తినడం వల్ల వస్తాయి. కానీ కారణం లేకుండా తరచుగా వాంతులు వస్తే..అది పొట్ట కేన్సర్ సూచన కావచ్చు.

Early Signs Of Stomach Cancer4/5

తరచుగా తేపులు రావడం…

భోజనం తర్వాత  తెపులు రావడం సాధారణం. కానీ అది తరచుగా, వాసన వేరుగా లేదా లోహ రుచితో ఉంటే..కేవలం గ్యాస్ సమస్య కాదు.. అది క్యాన్సర్ కూడా అవ్వచ్చు..

Stomach Cancer Symptoms5/5

అలసటగా అనిపించడం..

సాధారణంగా ఏదైనా ఎక్కువ తిన్నప్పుడు కొంచెం అలసటగా అనిపించవచ్చు. కానీ తరచుగా అలానే అనిపిస్తూ ఉంటే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది. ప్రారంభ లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం. అసాధారణ ఆహార సమస్యలు, బరువు తగ్గడం, వాంతులు లేదా పొట్ట నొప్పి లాంటి లక్షణాలను .. ఎప్పుడు చులకనగా తీసుకోకూడదు.