Ghee for health
నెయ్యి తింటే బరువు తగ్గుతామా లేదా బరువు పెరుగుతామా అని సందేహం ఎంతోమందిలో ఉంటుంది. కొంతమంది నెయ్యి తింటే చాలా లావు అవుతారు అని చెబుతూ ఉండగా.. మరి కొంతమంది ఏమో నెయ్యి తినడం ద్వారా బరువు తగ్గొచ్చు అని అంటారు.. నిజమేమిటో చూద్దాం..
మన తెలుగింటి వంటకాల్లో ఎన్నో పదార్థాల్లో నెయ్యి వేస్తూ ఉంటాం. అంతెందుకు వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అందులో ఏదైనా కూర వేసుకొని తింటే వచ్చే రుచే వేరు.
కానీ మధ్యలో నెయ్యి తింటే బరువు ఎక్కువగా పెరుగుతారు అనే అపోహలు రావడం వల్ల చాలామంది నెయ్యి వాడకం తగ్గించారు.
కానీ నిజం చెప్పాలి అంటే నూనె కన్నా కూడా నెయ్యి మంచిది. అయితే నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఉండటం వల్ల అది అధికంగా తింటే మాత్రం బరువు పెరగటం ఖాయం.
నెయ్యిని మితంగా తింటే.. ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉదయం పూట నీళ్లల్లో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల.. బరువు కూడా తగ్గొచ్చు.
కాబట్టి నెయ్యి మితంగా వారితే బరువు తగ్గడానికి.. అమితంగా వాడితే బరువు పెరగడానికి.. ఉపయోగపడుతుంది.