Add Zee Business As A Preferred Source
App

Urvashi Rautela Summoned: ఊర్వశి రౌతేలాకు బిగ్ షాక్.. ఏకంగా ఆ కేసులో నోటీసులు.!. టెన్షన్ లో బాలయ్య ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?

Written ByInamdar Paresh
Published: Sep 14, 2025, 06:20 PM IST|Updated: Sep 14, 2025, 06:26 PM IST

Ed summons actress Urvashi Rautela: బాలయ్య భామ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ సమన్లను జారీ చేసింది. ఆమెతో పాటు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తికి కూడా ఈడీ సమన్లు పంపింది. వీరిని తమ ఎదుట విచారణకు రావాలని ఆదేశించింది.

Uravashi rautela:1/5

ఊర్వేశి రౌతేలా కేసు:

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ఈడీ చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో అనేక మంది సెలబ్రీటీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో తాజాగా.. ప్రముఖ బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా వివాదంలో చిక్కుకుంది. ఆన్లైన్ అక్రమ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ఆమెకు ఈ బాలయ్య భామకు నోటీసులు పంపింది.  

Betting app promotion case:2/5

ఊర్వశిరౌతేలా:

అదే విధంగా.. సెప్టెంబర్ 16న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఊర్వశీ  విచారణకు రావాలని ఆదేశించింది.  ఊర్వశీ తో పాటు  తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మీమీ చక్రవర్తికి కూడా ఈడీ సమన్లు పంపి.. సెప్టెంబర్ 15న విచారణకు హాజరుకానున్నారు.  

ed case on urvashi rautela:3/5

బాలయ్య భామ:

ముఖ్యంగా వీరిని  1xBet యాప్ ప్రమోషన్స్  కేసుకు సంబంధించి ఈడీ విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఈడీ వీరిని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్‌తో సహా పలువురు ప్రముఖులను కూడా  ఈడీ అదుపులోకి తీసుకుని విచారించింది.

Betting app promotion case:4/5

బెట్టింగ్ యాప్ కేసు:

 PMLA నిబంధనల ప్రకారం అతని వాంగ్మూలాన్ని నమోదు చేసింది. విచారణ సమయంలో, వారు బెట్టింగ్ యాప్ యజమానులు వీరిని ఎలా సంప్రదించారు, అతనికి డబ్బు ఎలా చెల్లించారు, వారు ఎక్కడ పన్ను చెల్లించారు వంటి వాటిపై రైనా, శిఖర్ ధావన్ లను ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. 

Illegal Betting app case:5/5

ఈడీ కేసు:

ఈ కేసులో..  ED ప్రాథమిక దర్యాప్తులో సమాచార సాంకేతిక చట్టం, విదేశీ మారక నిర్వహణ చట్టం, PMLA మొదలైన అనేక చట్టాలను ఉల్లంఘించినట్లు వెల్లడైంది. 1xBet తో ముడిపడి ఉన్న అక్రమ బెట్టింగ్ కేసుకు సంబంధించి సెప్టెంబర్ 4న ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ధావన్‌ను ఏజెన్సీ ప్రశ్నించింది.  అయితే.. శిఖర్ ధావన్,  రైనా వాంగ్మూలాలను కేంద్ర ఏజెన్సీ ప్రశ్నించి నమోదు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకొవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఊర్వశి రౌతేలా బాలయ్య సరసన  డాకుమహారాజ్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో బాలయ్య అభిమానులు మ్యాటర్ ఏంటని తెగ టెన్షన్ పడిపోతున్నారు.