Cricketer Shikhar Dhawan: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌తో సంబంధం ఉన్న కేసులో ఆయనను విచారించనున్నారు.
1/5టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఆయన్ను విచారించనుంది. మనీలాండరింగ్ కు సంబంధించి ధావన్‌ను ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది.
2/5శిఖర్ ధావన్ 1xBet అనే చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్‌కు ప్రమోషనల్ ఎండార్స్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద శిఖర్ ధావన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు.
3/5అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
4/5ఈ బెట్టింగ్ యాప్స్.. చాలా మంది వ్యక్తులను, పెట్టుబడిదారులను కోట్లలో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
5/5నిషేదిత బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కారణంగా.. ఇప్పటికే మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, టాలీవుడ్ నటులు.. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులు ఈడీ విచారణకు హాజరయ్యారు.