Diaper Rashes in Babies: ఈ రోజుల్లో చిన్న పిల్లల కోసం ప్రతి ఒక్కరూ డైపర్లు వాడుతున్నారు. ఈ సమయంలో పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది కాబట్టి తడి వల్ల ర్యాషెస్ వస్తుంటాయి. దీని వల్ల శరీరంపై మంటగా అనిపించి పిల్లలు ఏడుస్తారు. ఈ సమస్యను తగ్గించడం తల్లిదండ్రులకు కూడా కాస్త ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను కొన్ని సింపుల్ చిట్కాలతో తగ్గించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1/5చిన్న పిల్లలు డైపర్లు వాడటం సాధారణమైన విషయం. వాళ్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. డైపర్ తడి వల్ల ర్యాషెస్ రావడం కూడా తరచూ జరుగుతుంది. ఈ ర్యాషెస్ కారణంగా చర్మం ఎర్రగా మారి చిన్న మచ్చలు, చికాకు కలిగించే గాయాలు వస్తాయి. దీంతో మంట వల్ల పిల్లలు చికాకుపడి ఏడుస్తారు. ఈ సమస్య పెద్దవాళ్లకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఈ ర్యాషెస్‌ను తగ్గించడానికి కొన్ని సులువు చిట్కాలు పాటించాలి.
2/5పిల్లలు టాయిలెట్ చేసిన వెంటనే డైపర్ తడిగా అవుతుంది. అందుకే తక్షణమే మార్చేయాలి. చర్మాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచడం ముఖ్యం. ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి డైపర్ మార్చడం మంచిది.
3/5డైపర్ మార్చేటప్పుడు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. సున్నితమైన కాటన్ లేదా బేబీ వైప్స్‌తో తుడవడం ఉత్తమం. ఆల్కహాల్ లేదా పరిమళం ఉన్న వైప్స్ వాడకపోవడమే మేలు. చర్మాన్ని శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా పొడిబారిన తరువాతే కొత్త డైపర్ వేయాలి. మార్చేముందు కొన్ని నిమిషాలు ఆ ప్రాంతానికి గాలి తగిలేలా వదిలేయాలి.
4/5పిల్లల డాక్టర్లు సూచించిన జింక్ ఆక్సైడ్ క్రీమ్ లేదా బేబీ ర్యాష్ క్రీమ్ రాయడం చాలా మంచిది. ప్రతి డైపర్ మార్చిన తర్వాత ఈ క్రీమ్ పూయడం వల్ల చర్మానికి రక్షణ కలుగుతుంది. పిల్లలను ఎప్పుడూ డైపర్‌తోనే ఉంచకుండా కొన్ని సమయాలు డైపర్ లేకుండా గాలికి వదిలేయాలి.
5/5ఇలా చేయడం వల్ల ర్యాషెస్ తగ్గి కొత్తవి రాకుండా ఉంటాయి. కొత్త డైపర్ వాడేటప్పుడు చర్మం ఎలా స్పందిస్తుందో గమనించాలి. పాలు తర్వాత కొత్త ఆహారాలు పరిచయం చేస్తున్నప్పుడు కూడా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ర్యాషెస్ నుంచి చెడు వాసన వచ్చినా లేదా గాయాల్లా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.