Epfo Good News: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఒకే నిమిషంలో UPI ఆప్షన్ ద్వారా అన్ని డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు ఇవే!

Employees Provident Fund Organisation Good News: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్  ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి పీఎఫ్ ఖాతాలోని డబ్బులను ఎంతో సులభంగా కేవలం ఒకే నిమిషంలో అన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికోసం ఈపీఎఫ్ ప్రత్యేకమైన యూపీఐ ఆప్షన్ను కూడా అందుబాటులోకి తీసుకురాబోతోంది.
 

Epfo Good News: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది ఎంతో సులభంగా తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తోంది. ముఖ్యంగా UPI సంబంధించిన యాప్స్ ను వినియోగించి కూడా ఈ విత్‌డ్రా ఆప్షన్ను అందిస్తోంది. ఇకనుంచి ఫోన్ పేతో పాటు జీపే, ఇతర యూపీఐ ఆప్స్ వినియోగించి కూడా పిఎఫ్ ను విత్ డ్రా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

1 /5

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (Employees Provident Fund Organisation)పీఎఫ్ విత్ డ్రా కోసం తమ అధికారిక వెబ్సైట్లో ప్రత్యేకమైన ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇకనుంచి ఏ ఉద్యోగైన యూపీఐ ఆప్షన్ వినియోగించి పిఎఫ్ డబ్బులను ఎంతో సులభంగా విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నాయి.  

2 /5

పేటీఎం, గూగుల్ పే లేదా ఫోన్‌పే వంటి యాప్‌లను వినియోగించి కూడా ఎంతో సులభంగా మీ పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులను ఇకనుంచి ఒక నిమిషంలోనే విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే ఈ డబ్బులు కూడా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమ కానున్నాయి.  

3 /5

EPFO ఈ కొత్త సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో ఈపీఎఫ్ ఖాతాదారులకు అందుబాటులోకి రాబోతోంది. ఈ యూపీఐ ఆప్షన్ వినియోగించి అన్ని రకాల మనీ ట్రాన్జక్షన్ యాప్స్ ద్వారా పిఎఫ్ (Employees Provident Fund Organisation) ను విత్ డ్రా చేసుకోవచ్చు.  

4 /5

ఈ యూపీఐ ఆప్షన్ ద్వారా డబ్బులను పిఎఫ్ ఖాతాలో నుంచి విత్ డ్రా చేసుకునేందుకు తప్పకుండా యూపీఐ పీఎఫ్ విత్‌డ్రా కేవైసీ ని చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా అధికారిక వెబ్సైట్లో ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.  

5 /5

ఇక ఈపీఎఫ్ యూపీఐ విత్‌డ్రా సేవలు ప్రారంభమైతే ఖాతాదారుడు నేరుగా ఒక నిమిషంలోనే ఈపీఎఫ్ ఖాతా నుంచి అన్ని డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రత్యేకమైన ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతోంది.