EPFO: పీఎఫ్ బదిలీ విషయంలో ఉద్యోగులు ఈ పొరపాటు చేస్తే భారీగా నష్టపోవడం ఖాయం


EPFO: ఎంప్లాయిమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రాధికారిక సంస్థ. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ,  ఉద్యోగులకు పదవి విరమణ అనంతరం వారి ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేశారు. 
 

1 /6

ఇది ఉద్యోగులకు పన్ను ప్రయోజనాలతో పాటు, సురక్షితమైన రాబడిని అందిస్తుంది. 20 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి సంస్థ కూడా ప్రావిడెంట్ ఫండ్ కు ఉద్యోగి తరపున ఒక వాటా జమ చేయాల్సి ఉంటుంది. మరోబాట ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తారు.   

2 /6

ఉద్యోగికి UAN అనే ఖాతా నెంబర్ పేరిట ఈ మొత్తం జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు మీ ఉద్యోగాన్ని మార్చుకుని, మీ మునుపటి EPF ఖాతాను మీ కొత్త కంపెనీకి బదిలీ చేయడానికని ఏం చేయాలో తెలుసుకుందాం. 

3 /6

మీరు ఉద్యోగాలు మారినప్పుడు మీ EPF ఖాతా సాధారణంగా మీ కొత్త కంపెనీ రికార్డులకు ఆటోమేటిగ్గా బదిలీ అవదు. బదులుగా,  యూనివర్సల్ ఖాతా నంబర్ (UAN) ను కొనసాగించడం ద్వారా పీఎఫ్ ఖాతా కంటిన్యూ అవుతుంది.   

4 /6

కొన్ని సందర్భాల్లో మీరు మీ EPF ఖాతాను కొత్త యాజమాన్య కంపెనీకి బదిలీ చేయకపోతే మీ పాత EPF ఖాతా వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.  EPFO నియమాల ప్రకారం, చివరి EPF కాంట్రిబ్యూషన్ నుంచి నుండి 36 నెలల (3 సంవత్సరాలు) వరకు నాన్ ఆపరేటివ్ EPF ఖాతాలపై వడ్డీ జమ అవుతుంది. 

5 /6

మీరు ఒకవేళ ఉద్యోగం మానేస్తే మీరు చివరి కాంట్రిబ్యూషన్ ఎప్పుడైతే పొందారో అక్కడి నుంచి మూడు సంవత్సరాల పాటు . మీ ఈపీఎఫ్ ఖాతా పైన వడ్డీ లభిస్తుంది. ఆ తర్వాత మీ ఖాతా Inactive అవుతుంది. ఆ తర్వాత వడ్డీ జమ అవడం ఆగిపోతుంది. చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగం మారినప్పుడు పాత ఖాతాను ట్రాన్స్ ఫర్ చేయడం మర్చిపోతుంటారు.   

6 /6

వారు తమ ఖాతాకు వడ్డీ జమ అవుతుంది అని భావిస్తుంటారు. మూడు సంవత్సరాల తర్వాత వడ్డీ ఆగిపోతుందనే సంగతి వారు మర్చిపోతారు. ప్రస్తుతం 2024–25 సంవత్సరానికి 8.25% ఈపీఎఫ్ వడ్డీ రేటు ఉంది. అయితే ఇది ప్రతి సంవత్సరం మారడం జరుగుతుంది. మీరు మూడు సంవత్సరాల తర్వాత కూడా ఖాతాను కొత్త ఖాతాకు బదిలీ చేయకపోతే మీరు వడ్డీ ఆదాయం కోల్పోతారు అని గుర్తించాలి.