EPF Ceiling Limit 2025: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు కనీస వేతన పరిమితిని పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి నెలకు రూ. 15,000గా ఉండగా..దీని కారణంగా చాలా మంది కార్మికులు పదవీ విరమణ తర్వాత అనేక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఉద్యోగుల అవసరాన్ని గుర్తించిన మోదీ సర్కారు లోక్‌సభలో ఈ విధంగా తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు అయ్యింది.
ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు కనీస వేతన పరిమితిని పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితి నెలకు రూ. 15,000గా ఉండగా..దీని కారణంగా చాలా మంది కార్మికులు పదవీ విరమణ తర్వాత అనేక ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఉద్యోగుల అవసరాన్ని గుర్తించిన మోదీ సర్కారు లోక్‌సభలో ఈ విధంగా తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు అయ్యింది.
EPF పరిమితి పెంపుపై ప్రభుత్వ స్పందన EPF కవరేజ్ కోసం వేతన పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 30,000కి పెంచే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా అనే ప్రశ్నను పార్లమెంట్‌లో మోదీ సర్కారుకు ఎదురైంది. ఈ ప్రశ్నలపై కార్మిక, ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.
సీలింగ్‌లో ఏవైనా మార్పులు తీసుకునే ముందు, తప్పనిసరిగా ఉద్యోగ యూనియన్లు, పరిశ్రమ సంస్థలతో వాటాదారుల సంప్రదింపులు జరుపుతామని మంత్రి హామీ ఇచ్చారు.
వేతన సీలింగ్‌ను సవరించడం అనేది ఉద్యోగులు లేదా కార్మికులు ఇంటికి తీసుకెళ్లే జీతం (Take-home Salary) పైనే కాకుండా యజమానుల నియామక ఖర్చులపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి వాటిపై విస్తృత సంప్రదింపులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
1952 EPF పథకం ప్రకారం.. EPFO పరిధిలోకి వచ్చే సంస్థలలో నెలకు రూ. 15,000 వరకు సంపాదించే ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థలో ఖాతా తెరవాలి. అయితే ఈ తప్పనిసరి నమోదు కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పుడు ఈ పరిమితిని నెలకు రూ. 6,500 నుంచి రూ. 15,000 కు పెంచారు.
2014 తర్వాత పట్టణ ప్రాంతాల్లో జీతాలు వేగంగా పెరిగాయి. కానీ EPF సీలింగ్‌లో మాత్రం మార్పులేదు. దీనివల్ల రూ. 15,000 కంటే కొద్దిగా ఎక్కువ జీతం పొందుతున్న లక్షలాది మంది ప్రారంభ స్థాయి పట్టణ కార్మికులు పదవీ విరమణ పొదుపుల భద్రతను కోల్పోతున్నారు. పరిమితిని రూ. 30,000కి పెంచితే, ఈ ఉద్యోగులు కూడా EPF కింద భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారని కార్మికుల వాదన.