PF Balance: పీఎఫ్ వడ్డీ జమయిందా లేదా తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండిలా..!
PF Balance : ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ సేవలను అందిస్తోంది. ఉద్యోగి వేతనంలో ప్రతినెలా కొంత భాగం, కంపెనీ కొంత భాగం పీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేస్తారు. ఉద్యోగి తన ప్రాథమిక వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్‌లో పెట్టుబడి పెడతాడు. ఈ మొత్తం ప్రతినెలా ఉద్యోగి ఖాతాలో జమ అవుతుంది. పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన మొత్తానికి వడ్డీ కూడా ఇస్తారు. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు ఖాతాలో వడ్డీ డబ్బు జమ అయ్యిందా లేదా అనే విషయాన్ని మీరు క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలో 8.25 శాతం వడ్డీ జమ చేస్తారు. ఈ మొత్తాన్ని తెలుసుకునేందుకు 4 మార్గాలు ఉన్నాయి. ఇందులో ఉమంగ్ యాప్, మెసేజ్, మిస్డ్ కాల్, EPFO పోర్టల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.
మీ ఫోన్‌లో UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. ఆ తర్వాత మీ యూజర్ ID, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి. దీని తర్వాత, మీరు పొందాలనుకుంటున్న సర్వీస్ పై క్లిక్ చేయండి. ఉదాహరణకు, మీరు ఖాతాలో జమ అయిన డబ్బును చూడాలనుకుంటే, 'వ్యూ పాస్‌బుక్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే PF ఖాతా బ్యాలెన్స్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీనిలో కస్టమర్ తన కేవైసీని కూడా అప్ డేట్ చేసుకోవచ్చు.
ముందుగా EPFO అధికారిక పోర్టల్‌కి వెళ్లి , ఆ తర్వాత ఉద్యోగి ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత మీరు UAN నంబర్, పాస్‌వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత, స్క్రీన్‌పై 'మెంబర్ పాస్‌బుక్'ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ఆపై ఖాతా పాస్‌బుక్‌ని చూసేందుకు మీరు మళ్లీ UAN నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత పాస్ బుక్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
మిస్డ్ కాల్ ద్వారా EPFO బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ముందుగా ఖాతాదారుడు తన UAN రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. మీకు మరో మెసేజ్ వస్తుంది. ఇందులో అకౌంట్లో ఉన్న ఎంత బ్యాలెన్స్ ఉందో పూర్తి మెసేజ్ వస్తుంది.
EPFO సభ్యులు మెసేజ్ ద్వారా తాజా సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం, 'UAN EPFOHO ENG' అని వ్రాసి, 7738299899 నెంబర్ కు మెసేజ్ చేయండి. మిస్డ్ కాల్ లాగా, PF ఖాతా బ్యాలెన్స్ కోసం ఖాతా వివరాలు మెసేజ్ లో వివరంగా వస్తాయి.