EPFO Major Announcement: ప్రైవేట్ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అందించింది ఈపీఎఫ్ఓ. EDLI స్కీమ్ కు సంబంధించి ఒక కీలక ప్రకటన చేసింది. ఈపీఎఫ్ఓ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఉద్యోగి మరణించిన సందర్భాల్లో అతని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ ప్రయోజనంలో ఇప్పటి వరకు ఉన్న గందరగోళం తొలగిపోనుంది.
1/8EDLI స్కీమ్ కింద డెత్ క్లెయిమ్స్ ను పరిష్కరించే సమయంతో వీకెండ్స్ లేదా అధికారికంగా ప్రకటించిన సెలవులను ఇక నుంచి సర్వీసులో విరామంగా పరిగణించబోమని ఈపీఎఫ్ఓ స్పష్టంగా తెలిపింది. రెండు ఉద్యోగాల మధ్య వచ్చే శనివారం, ఆదివారాలు లేదా ప్రకటించిన సెలవులు ఉన్నా వాటిని సర్వీస్ లో గ్యాప్ గా పరిగణించరాదని పేర్కొంది. ఈ నిర్ణయంతో గతంలో రిజక్ట్ అయినా లేదా తక్కువ మొత్తం పరిష్కరించిన అనేక క్లెయిమ్స్ కు న్యాయం జరగనుంది.
2/8దీనిపై ఈపీఎఫ్ఓ ఎందుకు స్పష్టత ఇవ్వాల్సి వచ్చిందంటే.. EDLI ప్రయోజనాలకు నిరంతర సర్వీస్ అనే నిర్వచనం విషయంలో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొనడమే ప్రధాన కారణమని చెప్పాలి. దీనిపై స్పందించిన ఈపీఎఫ్ఓ డిసెంబర్ 17వ 2025న ఒక సర్క్కూలర్ ను కూడా విడుదల చేసింది. ఆ సర్క్యూలర్ లో తక్కువ సెలవులు, లేదా వీకెండ్ సర్వీస్ బ్రేక్ గా పరిగణించడం వల్ల అనేక సందర్భాల్లో డెత్ క్లెయిమ్స్ రిజక్ట్ అయినట్లు లేదా తక్కువ మొత్తంలో చెల్లింపులు జరిగినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.
3/8అయితే కొన్ని కేసుల్లో ఒక ఈపీఎఫ్ కవర్ చేసిన సంస్థను విడిచి మరో సంస్థలో చేరే మధ్యలో వచ్చే శనివారం ఆదివారాలను కూడా సర్వీసులో బ్రేక్ గా పరిగణించిన ఉదాహరణలు తమ ద్రుష్టించి వచ్చినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది. దీని ఫలితంగా ఉద్యోగి పలు కంపెనీల్లో కలిపి 12 నెలల కంటే ఎక్కువ కాలం పనిచేసినా.. EDLI ప్రయోజనాలను నిరాకరించిన పరిస్థితులు కూడా ఉన్నాయని పేర్కొంది.
4/8
ఈ నేపథ్యంలోనే.. రెండు ఉద్యోగాల మధ్య గరిష్టంగా 60 రోజుల వరకు గ్యాప్ ఉన్నా కూడా,.. ఆ ఉద్యోగి మల్టిపుల్ EPF కవర్ చేసిన సంస్థల్లో పనిచేసినట్లయితే, అతడిని కంటిన్యూ సర్వీస్ కలిగిన సభ్యుడిగానే పరిగణించాలని EPFO స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు అందడంలో స్పష్టత ఏర్పడుతుందని, క్లెయిమ్ ప్రక్రియ మరింత న్యాయంగా మారుతుందని సంస్థ భావిస్తోంది.
5/8
ఇక EDLI పథకం గురించి మాట్లాడుకుంటే.. , ఇది EPF సభ్యుల కోసం పూర్తిగా యజమాని నిధులతో అమలు చేసే జీవిత బీమా పథకం. ఉద్యోగి సేవలో ఉండగానే మరణించిన సందర్భంలో, అతని నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఒకేసారి గరిష్టంగా రూ.7 లక్షల వరకు ఇన్సూరెన్స్ మొత్తం చెల్లిస్తుంది. ఈ పథకంలో ఉద్యోగి నుంచి ఎలాంటి అదనపు కంట్రిబ్యూషన్ అవసరం లేకుండా, ఆర్థిక భద్రతను అందించడం దీని ప్రధాన లక్ష్యం.
6/8
EPFO నిర్వహించే ఈ EDLI పథకం, EPF ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS)లకు అనుబంధంగా పనిచేస్తుంది. ఇందులో చెల్లించే ఇన్సూరెన్స్ మొత్తం, ఉద్యోగి సగటు జీతం, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తుంది. క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించడంపై EPFO ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
7/8
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మరణానికి ముందు వరుసగా 12 నెలలు పనిచేయని సభ్యులు లేదా సగటు PF బ్యాలెన్స్ రూ.50,000 కంటే తక్కువగా ఉన్న సభ్యుల కుటుంబాలకు కనీస ప్రయోజనాన్ని EPFO ఇప్పటికే పెంచింది. అలాంటి సందర్భాల్లో, ఆధారపడినవారు లేదా చట్టబద్ధమైన వారసులకు కనీసంగా రూ.50,000 ఇన్సూరెన్స్ మొత్తం అందేలా మార్పులు చేసింది.
8/8
మొత్తానికి EDLI పథకానికి సంబంధించి EPFO జారీ చేసిన ఈ తాజా స్పష్టత, ప్రైవేట్ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటగా మారనుంది. ముఖ్యంగా ఉద్యోగ మార్పుల సమయంలో చిన్న విరామాల కారణంగా ఇన్సూరెన్స్ హక్కులు కోల్పోయే పరిస్థితులు ఇకపై తగ్గే అవకాశం ఉంటుంది.